ఆ విషయంలో అమ్మానాన్న మాటే వింటానంటున్న చిన్నది

సొట్టబుగ్గల చిన్నది తాప్సి పెళ్లిపై ఆసక్తి చూపిస్తోంది.ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీ స్టార్‌గా ఉన్నా కూడా ఈ అమ్మడు పెళ్లి గురించి ఆసక్తికర వ్యాక్యలు చేసింది.

 Taapsee, Bollywood, Marriage, Love Marriage, Parents, Jhummandi Nadam, Fame, Taa-TeluguStop.com

త్వరలోనే తాను పెళ్లి చేసుకుంటాను అంది.అయితే తాను ప్రేమ వివాహం మాత్రం చేసుకోను.

నా పెళ్లి విషయంలో పూర్తిగా అమ్మా నాన్న మరియు సోదరి నిర్ణయంకు కట్టుబడి ఉంటాను అంటూ ప్రకటించింది.ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల కొంత అపఖ్యాతి వస్తుందనే అభిప్రాయంను ఈ అమ్మడు వ్యక్తం చేసింది.

ఇంతకాలం నటిగా మంచి పేరు దక్కించుకుని, పేరు ప్రఖ్యాతలు పొంది ఇప్పుడు ప్రేమ పెళ్లి చేసుకోవడం వల్ల ఆ పేరు అంతా పోతుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది.అయితే ప్రేమ వివాహం చేసుకుంటే పరువు పోతుంది అంటూ ఈమె ఆలోచించడం విడ్డూరంగా ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగులో ఈ అమ్మడు ఝుమ్మంది నాధం చిత్రంతో పరిచయం అయ్యింది.పలు చిత్రాల్లో నటించినా కూడా ఈమెకు మాత్రం ఆఫర్లు ఆశించినంతగా రాలేదు.

Telugu Bollywood, Jhummandi Nadam, Love, Taapsee-

సౌత్‌లో ఛాన్స్‌లు తగ్గడంతో బాలీవుడ్‌కు ప్రయాణం అయ్యింది.అక్కడ చిన్న చిన్న చిత్రాలు చేస్తూ ప్రస్తుతం క్రేజీ హీరోయిన్‌గా మారింది.ఈమె లక్కీగా మంచి పాత్రల్లో నటించింది.నటిగా మంచి గుర్తింపు దక్కించుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.ఈ సమయంలో ఈమె పెళ్లి గురించి విభిన్నంగా స్పందించడం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.అమ్మానాన్నల మాట విని పెళ్లి చేసుకోవడం అనేది మంచి నిర్ణయం.

అలాగని ప్రేమ వివాహంను తప్పుబడట్టడం సరైనది కాదంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube