థియేటర్లలో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ల ప్రదర్శన..

T20 World Cup Matches In Theaters

తాజాగా ఐపీఎల్ సీజన్ ముగిసిన విషయం తెలిసిందే.ఐపీఎల్ తుదిపోరులో కేకేఆర్‌పై సీఎస్‌కే జట్టు ఘన విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది.

 T20 World Cup Matches In Theaters-TeluguStop.com

ఈ ఐపీఎల్ మ్యాచ్‌లు క్రికెట్ ప్రియులకు మంచి వినోదాన్ని పంచాయి.వీటి తరువాత క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించడానికి టీ20 వరల్డ్ కప్ ముస్తాబవుతోంది.

అక్టోబర్ 17న టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది.దీనితో ఫ్యాన్స్ బాగా ఎగ్జైట్ అవుతున్నారు.ఈ క్రమంలో మల్టీప్లెక్స్‌ల నిర్వహణ సంస్థ ఐనాక్స్‌ లెజర్‌ ఫ్యాన్స్‌కు ఓ అదిరిపోయే న్యూస్ అందించింది.

 T20 World Cup Matches In Theaters-థియేటర్లలో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ల ప్రదర్శన..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టీ20 క్రికెట్‌‌లో టీమిండియా ఆడే మ్యాచ్‌లను తమ థియేటర్లలో ప్రదర్శిస్తామని ఐనాక్స్‌ లెజర్‌ (Inox Leisure) ప్రకటించింది.టీ20 మ్యాచ్‌లు అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరగనుండగా.ఆ మ్యాచ్‌లన్నీ మెయిన్ సిటీల్లో తమ మల్టీప్లెక్స్‌ థియేటర్లలో ప్రదర్శిస్తామని ఐనాక్స్‌ యాజమాన్యం వెల్లడించింది.

కేవలం భారత్ మ్యాచ్‌లను మాత్రమే ప్లే చేస్తామని క్లారిటీ ఇచ్చింది.ఐనాక్స్ సంస్థకు ఇండియాలోని 70 నగరాల్లో 56 మల్టీప్లెక్స్‌ల్లో 658 స్క్రీన్‌లు ఉన్నాయి.

బిగ్ స్క్రీన్‌పై పొట్టి క్రికెట్ మ్యాచ్‌లను వీక్షించడం వల్ల నేరుగా చూసిన అనుభూతి కలుగుతుందని ఐనాక్స్ సంస్థ చెప్పింది.

Telugu Latest, Matchs, Ups, Cup, Threarera-Latest News - Telugu

క్రికెట్‌ మైదానంలో కూర్చుని మ్యాచ్‌లను వీక్షించినంతగా.ఆడియన్స్‌కు మంచి అనుభూతి కలిగించడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశమని ఆ సంస్థ చెబుతోంది.ఆడియన్స్‌ మ్యాచ్‌లను చూసే సమయంలో స్నాక్స్ కొనుగోళ్లు చేస్తారు కాబట్టి బిజినెస్ కూడా పుంజుకుంటుందని ఐనాక్స్ సంస్థ భావిస్తోంది.

ఈ క్రికెట్‌ మ్యాచ్‌ల టికెట్టు ధర నగరాన్ని బట్టి మారుతుంది.చిన్న సిటీలలో ఓ టికెట్ ధర రూ.200 ఉండనుంది.పెద్ద నగరాల్లో ఆ ధర రూ.500 వరకు ఉండొచ్చని ఐనాక్స్ వెల్లడించింది.

ఇక ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీ టీ20 మ్యాచ్‌లను యూఏఈ, ఒమన్‌లలో నిర్వహిస్తున్నారు.నిజానికి టీ20 ప్రపంచకప్మ్యాచ్‌లు భారత్‌లో జరగాల్సి ఉంది కానీ కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆతిధ్యం కాన్సిల్ అయ్యింది.

#Matchs #Threarera #Cup

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube