టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌పై అదిరిపోయిన యాడ్‌.. ఇండియా, పాకిస్తాన్‌లో ర‌చ్చ‌

T20 World Cup Match Ad Going Viral Discussion In India And Pakistan Details

క్రికెట్ అంటే ఇండియాలో, పాకిస్తాన్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.క్రికెట్ మీద ఎన్నో ర‌కాల బెట్టింగులు న‌డుస్తూనే ఉంటాయి.

 T20 World Cup Match Ad Going Viral Discussion In India And Pakistan Details-TeluguStop.com

ఇక ఇప్పుడు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సంద‌డి త్వ‌ర‌లోనే స్టార్ట్ కాబోతుండ‌టంతో దీనిమీద ఇప్ప‌టి నుంచే ఎన్నో అంచ‌నాలు మొద‌ల‌య్యాయి.అప్పుడే మ్యాచుల‌పై ఎన్నో ర‌కాల రూమ‌ర్లు న‌డుస్తున్నాయి.

మ‌రీ ముఖ్యంగా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌ల‌పై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.ఇందులో ఏ దేశం గెలుస్తుందా అంటూ ఇప్ప‌టికే బెట్టింగులు కూడా జ‌రుగుతున్నాయంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

 T20 World Cup Match Ad Going Viral Discussion In India And Pakistan Details-టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌పై అదిరిపోయిన యాడ్‌.. ఇండియా, పాకిస్తాన్‌లో ర‌చ్చ‌-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిన్నటి దాకా ఐపీఎల్ ఎంత‌లా ఎంట‌ర్ టైన్ చేసిందో అంద‌రికీ తెలిసిందే.యూఏఈ వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ మ్యాచులు ఎంత‌లా ఎంట‌ర్ టైన్ చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం.

ఇక‌పోతే నిన్న‌టితో ముగిసిన టోర్నీలో చెన్నై సూప‌ర్ కింగ్స్ విజ‌య‌కేత‌నం ఎగ‌రేసింది.ఇక దీని త‌ర్వాత మ‌రోసారి ఎంట‌ర్ టైన్ చేసేందుకు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచులు రెడీ అయిపోయాయి.

దీంతో అంద‌రూ దీనిపైనే దృష్టి పెడుతున్నారు.ఇందులో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఈ నెల 24న జ‌రగ‌బోతోంది.

ఈ మ్యాచ్ పై ఇప్పుడు ఓ యాడ్ తెగ వైర‌ల్ అవుతోంది.

అదేంటంటే ఈ యాడ్‌ను బ్రాడ్ కాస్టర్ స్టార్ట్స్ సంస్థ రిలీజ్ చేసింది.

అయితే దీన్ని కాస్తా మ్యాచులో ప్రత్యర్థిని ఏడిపించే విధంగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా రెడీ చేసింది.

Telugu India Pakistan, India Team, World Cup-Latest News - Telugu

ఇందులో ఓ షోరూమ్‌లో ఇద్ద‌రు ఇండియా, పాకిస్తాన్ అభిమానులు ఇద్ద‌రూ ఓ టీవీ షోరూమ్‌కు వెళ్తారు.కాగా ఇందులో ఇండియా అభిమాని రెండు టీవీల‌ను కొనుగోలు చేసి పాక్ అభిమాని చేతిలో పెడుతాడు.అయితే పాక్ అభిమాని వాటిని చూసి రెండు ఎందుకని అడగ్గా ఒక‌టి మ్యాచ్ చూడ‌టానికి మ‌రొక‌టి పగులగొట్టడానికని సమాధానమిస్తాడు.

దీన్ని బ‌ట్టి చూస్తూ ఇప్ప‌టి దాక ఆడిన మ్యాచుల్లో ఇండియానే ఎక్కువ‌గా గెలుస్తోంది.కాబ‌ట్టి రాబోయే మ్యాచ్‌లో కూడా ఇండియానే గెలుస్తుంద‌ని, పాక్ ఓడిపోతుంది కాబ‌ట్టి ఇలా టీవీ ప‌గ‌ల‌గొట్టుకోవ‌చ్చ‌ని ఈ యాడ్ ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం దీన్ని చూసిన పాక్, ఇండియా అభిమానులు తెగ ర‌చ్చ చేస్తున్నారు.

#India Pak Mouka #World Cup #India Team #India Pakistan #World Cup Match

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube