టీ20 వరల్డ్‌కప్ 2022 షెడ్యూల్ షురూ..!

ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2022 షెడ్యూల్‌ ని ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌ కౌన్సిల్ (ఐసీసీ) శుక్రవారం విడుదల చేసింది.ఈసారి ఈ మెగా టోర్నీ ఆస్ట్రేలియా గడ్డపై జరగనుంది.

 T20 World Cup 2022 Schedule Begins, T20 World Cup, Schedule, Bcci, 2022 ,sports-TeluguStop.com

ఈ వ‌ర‌ల్డ్‌కప్ అక్టోబ‌ర్ 16 నుంచి న‌వంబ‌ర్ 13 మ‌ధ్య జ‌ర‌గ‌నుంది.ఈ మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పోటీపడబోతుండగా.45 మ్యాచ్‌లు జరగనున్నాయి.నవంబర్ 9న తొలి సెమీఫైనల్ ఉండగా.

నవంబర్ 10న రెండో సెమీఫైనల్, నవంబర్ 13న ఫైనల్ జరుగుతాయి.

అక్టోబరు 16 నుంచి 21 వరకూ మొదటి రౌండ్ మ్యాచ్‌లు జరగనుండగా.

ఆ తర్వాత అక్టోబరకు 22 నుంచి సూపర్-12‌ మ్యాచ్‌ లు.నవంబరు 13న మెల్‌బోర్న్‌ వేదికగా ఫైనల్ జరగనుంది.ఈ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో టీమిండియా త‌మ మొదటి మ్యాచ్ ను చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌ తోనే మొద‌లు పెట్ట‌నుంది.ఈ మ్యాచ్ అక్టోబరు 23న జరగనుంది.ఇక సూపర్-12 లో‌ని గ్రూప్-1లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ తో పాటు తొలి రౌండ్‌లోని గ్రూప్ A విజేత, గ్రూప్ B రన్నరప్ ఉండ‌నున్నాయి.ఇక గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లతో పాటు.

తొలి రౌండ్‌లోని గ్రూప్ B విజేత, గ్రూప్ A ర‌న్న‌ర‌ఫ్ ఉండ‌నున్నాయి.

ఆ పై గ్రూప్-1, గ్రూప్-2లోకి ఫస్ట్ రౌండ్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన నాలుగు జట్లు అక్టోబరు 21న వచ్చి చేరుతాయి.

అయితే, ఈ సారి శ్రీలంక, వెస్టిండీస్ లాంటి పెద్ద జట్లు సైతం నేరుగా సూపర్-12కి అర్హత సాధించలేకపోయాయి.దీంతో అవి మొదటి రౌండ్‌లో చిన్న జట్లతో పోటీపడి అవి టోర్నీకి అర్హత సాధించాల్సి ఉంటుంది.

అక్టోబరు 22న న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య ఫస్ట్ మ్యాచ్‌తో సూపర్-12 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.ఈ మ్యాచ్‌కి మెల్‌బోర్న్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.ఇక సూప‌ర్ 12, సెమీ ఫైన‌ల్స్‌, ఫైన‌ల్ మ్యాచ్‌ల‌కు బ్రిస్బేన్, పెర్త్, అడిలైడ్, సిడ్నీ, మెల్‌బోర్న్ వేదిక‌లుగా నిల‌వ‌నున్నాయి.ఫైన‌ల్ మ్యాచ్ ఆస్ట్రేలియా కాల‌మానం ప్ర‌కారం రాత్రి 7 గంట‌ల‌కు ప్రారంభం కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube