నేటి నుంచి మొదలు కాబోతున్న టీ20 వరల్డ్‌కప్ సమరం..!

ఐపీఎల్ సీజన్ ముగిసిన కొద్ది గంటల వ్యవధిలోనే టీ20 వరల్డ్‌కప్ ప్రారంభం కావడానికి సిద్ధమైంది.అక్టోబర్ 17న అంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్ మ్యాచ్‌లు నవంబర్ 14 వరకు కొనసాగనున్నాయి.దాదాపు నెల రోజుల పాటు.16 దేశాలు 45 మ్యాచ్‌లు ఆడనున్నాయి.దీంతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రియులు ఉత్తేజపూరితమైన మ్యాచ్‌లు వీక్షించడానికి సిద్ధమైపోయారు.

 T20 Cricket World Cup Is Going To Start From Today, T20 World Cup, Latest News,-TeluguStop.com

ఆదివారం నాడు క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు ఆరంభం కానుండగా.

క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో మొత్తం 16 జట్లు 8 జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విడిపోయి తలపడతాయి.క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో ప్రతి గ్రూప్‌ నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 12 రౌండ్‌కు చేరుకుంటాయి.

అంటే మొత్తంగా నాలుగు జట్లు సూపర్ 12 రౌండ్‌లో ఆడేందుకు అర్హత సాధిస్తాయి.ఇప్పటికే టాప్ 8 జట్లు 12 రౌండ్‌లో ఆడేందుకు అర్హత సాధించగా.

మిగతా 8 టీమ్స్ మిగిలిన నాలుగు స్థానాల కోసం క్వాలిఫయర్‌ మ్యాచ్‌ల్లో ఆడతాయి.ఒమన్‌లో క్వాలిఫయింగ్‌ రౌండ్‌ పూర్తయిన తర్వాత అక్టోబర్ 23 నుంచి అసలైన ప్రధాన టోర్నమెంట్ ప్రారంభం అవుతుంది.ఆ రోజు నుంచి దిగ్గజ జట్ల మధ్య హోరాహోరి సమరం మొదలవుతుంది.సూపర్‌-12 ఫైట్‌ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచ్‌తో శుభారంభం కానుంది.

మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి ప్రారంభం కానున్న తొలి మ్యాచ్‌లో పపువా న్యూగినియాతో ఒమన్‌ జట్టు తలపడనుంది.

Telugu Australis, Bangladesh, India, Indian Cup, Latest, Pakistan, Matches, Cup-

సాయంత్రం 7:30 కి ప్రారంభమయ్యే రెండో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో బంగ్లాదేశ్‌ ఆడనుంది.బంగ్లాదేశ్ తమ జట్టుపై పడిన పసికూనలనే ముద్ర చెరిపి వేసేందుకు సమాయత్తమవుతోంది.ఇక న్యూగినియా జట్టు కరోనా సమయంలో తమ దేశ ప్రజల్లో కాస్త వినోదం నింపేందుకు టీ20 వరల్డ్‌కప్ లో ఆడాలని నిర్ణయించుకుంది.

ఒమన్‌ మాత్రం తమ సొంత గడ్డపై సత్తా చాటాలని బరిలోకి దిగింది.

అయితే ఆదివారం నుంచి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు జరుగుతుండగా.సోమవారం నుంచి టాప్ 8 జట్లకు వామప్‌ మ్యాచ్‌లు ఆరంభంకానున్నాయి.వామప్‌ మ్యాచ్‌లు ఈ నెల 18, 20న జరుగుతాయి.18న జరిగే ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-భారత్‌.20న జరిగే ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌-టీమిండియా పోటీ పడనున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube