టీ సిరిస్ తో భారీ డీల్ కుదుర్చుకున్న సాహో టీం  

200 కోట్లకి సాహో మూవీ హిందీ రైట్స్ సొంతం చేసుకున్న టి సిరిస్ .

T Series Spend 200 Crores For Sahoo Movie Hindi Rights-hero Prabas,heroine Shradha Kapoor,sahoo Movie Hindi Rights,t Series Spend 200 Crores,tollywood

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా , యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో, సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా సాహో. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇందులో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా నటిస్తున్నాడు..

టీ సిరిస్ తో భారీ డీల్ కుదుర్చుకున్న సాహో టీం-T Series Spend 200 Crores For Sahoo Movie Hindi Rights

హాలీవుడ్ స్టాండర్డ్స్ లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టాకీ పార్ట్ ఇప్పటికే పూర్తయ్యింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా సాంగ్స్ ప్రస్తుతం హైదరాబాద్ లో తెరకేక్కుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం ఇప్పుడు బాలీవుడ్ లో భారీ డిమాండ్ ఏర్పడింది.

ఇదిలా ఉంటే సాహో సినిమా హిందీ రైట్స్ కోసం భారీ పోటీ మద్యలో టీ సిరిస్ సంస్థ ఏకంగా రెండు వందల కోట్లతో రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం హిందీలో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ నేపధ్యంలో ఇంత మొత్తం సినిమా కోసం వెచ్చించినట్లు టీసిరిస్ సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ ఇంత పెద్ద మొత్తంలో సినిమా మీద పెట్టడానికి కారణంగా నిర్మాణ విలువలతో పాటు, బాలీవుడ్ స్టార్ కాస్టింగ్ ఎక్కువగా సినిమాలో ఉండటమే అనే మాట వినిపిస్తుంది.

ఇక ఆగష్టు 15న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఎ స్థాయిలో రికార్డ్ సృష్టిస్తుంది అనేది వేచి చూడాలి.