టీ - కాంగ్రెస్ టీఆర్ఎస్ పై వేసే అస్త్రం ఇదే   T- Congress Want KAMMA Community Support     2017-12-28   22:21:30  IST  Bhanu C

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు టిడిపి ఎంత స్ట్రాంగ్ గా ఉండేదో అందరికీ త్లిసిన విషయమే..రాష్ట్ర విభజన తరువాత కూడా టిడిపి అక్కడ తిరుగులేని పోరు సలిపింది..ఎంతో బలమైన కేడర్ ఇప్పటికి చెక్కు చెదరలేదు..అయితే నాయకులు మార్పు జరిగినప్పుడు సాధారణంగానే వాళ్ళు వేరే పార్టీకి సపోర్ట్ చేసినా మాతృక మాత్రం టిడిపినే..అయితే ఇప్పుడు తెలంగాణలో ఉన్న టిడిపికి బలమైన ఓటు బ్యాంక్ అయిన కమ్మ ఓట్లు..ఆ సామాజిక వర్గం యొక్క సపోర్ట్ కోసం అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పోటా పోటీ పడుతున్నాయి..అయితే కేసీఆర్ ఎంతో తెలివిగల వ్యక్తి కనుకనే ముందుగానే టిడిపిలో ఉన్న కమ్మ వర్గానికి చెందినా నాయకులని కమ్మ వర్గ సపోర్ట్ ఉన్న బలమైన నాయకులని కారు ఎక్కించేశాడు..అయితే ఇప్పుడు కాంగ్రెస్ నాలిక కరుచుకుని ఆ సామాజిక ఓట్ల కోసం సపోర్ట్ కోసం పాకులాడుతోంది.

అయితే కాంగ్రెస్ ఇప్పటికే తెలంగాణాలో దాదాపు ఉనికి కోల్పోయే పరిస్థితుల్లో ఉన్న టీడీపీ పై గురిపెట్టింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో మంత్రులుగా చేసిన వాళ్లను..ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్లను కూడా కేసీఆర్ టీఆర్ఎస్ లో చేర్చేసుకున్నాడు..మరి కొందరు కేసీఆర్ తో ఉండే విభేదంతో కాంగ్రెస్ వైపు వెళ్లిపోయారు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ఓ కొత్త పథకాన్ని సిద్ధం చేసుకుంది. తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ… వస్తున్న ఆ ప్రధాన సామజిక వర్గం ‘కమ్మ’ కులం పై ఇప్పుడు కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది.

తెలంగాణాలో టీడీపీ ఉనికి కోల్పోవడం రుచించని ఆ కుల నాయకుల తమ వైపు లాక్కొని లాభపడాలని కాంగ్రెస్ చూస్తోంది. హైదరాబాద్..ఖమ్మం వంటి ప్రాంతాల పరిధిల్లో కమ్మ వాళ్ల జనాభా ఎక్కువగా ఉంది. హైదరాబాద్ లో వీళ్లు భారీ ఎత్తున సెటిలయ్యారు. ఈ సమయంలోనే హైదరాబాద్ పరిధిలో కమ్మ ఓటర్లను తనవైపుకు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కిందా మీద పడుతోంది..కాంగ్రెస్ సీనియర్స్ అందరు ఇప్పుడు ఈ విషయంపైనే దృష్టి పెట్టారట..అంతేకాదు వారిలో ఎవరినా బలమైన నాయకుడిని ఎంపిక చేసి పెద్ద పదవి కట్టబెట్టే ప్రయత్నం కూడా చేస్తోంది.

ఈ విషయంలో ఇప్పటికే వ్యూహాలను కాంగ్రెస్ పన్నుతోంది. జూబ్లీహిల్స్..కూకట్ పల్లి..శేరిలింగం పల్లి వంటి నియోజకవర్గంలో ఏపీ కాంగ్రెస్ లోని కమ్మ లీడర్లను రంగంలోకి దించి టీఆర్ఎస్ ని ఘోరంగా ఓడించి తమ పట్టు నిలుపుకోవాలని పెద్ద ప్లాన్ వేసింది అని తెలుస్తోంది..ఏపీ కాంగ్రెస్ లో ఇప్పటికీ కొంతమంది కమ్మ వాళ్లున్నారు. వాళ్లను హైదరాబాద్ తీసుకొచ్చి పోటీ చేయించాలని ఆ పార్టీ ప్లాన్.అయితే ఆది నుంచీ రెడ్లకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు కమ్మ సామాజిక వర్గాన్ని బయటకి తీసి పదవులు కట్టబెడితే రెడ్లు పర్తేకీ దూరం అయ్యే చాన్స్ లేకపోలేదు…కాంగ్రెస్ చేసే ఈ ప్లాన్ ఉన్న నాలుకకు మందేస్తే కొండనాలుక ఊడింది అన్న చందంగా అవుతుందోమో అని కూడ మరో వైపు ఆలోచన చేస్తున్నారట