హరీష్ టార్గెట్ గా కాంగ్రెస్ “మైండ్ గేమ్”   T-Congress Mind Game..Target Harish Rao     2018-02-08   00:01:00  IST  Bhanu C

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నయా మైండ్ గేమ్ కి తెరతీసింది..మైండ్ గేమ్ లు ఆడటంలో కాంగ్రెస్ దిట్ట దాంతో ఇప్పుడు టీఆర్ఎస్ పై తన ప్రతాపం చూపించడానికి సిద్దం అయ్యింది..అసలు ఈ గేమ్ రెండు నేలల క్రితమే మొదలు పెట్టింది..ఇప్పుడు మెల్లె మెల్లగా పూర్తి స్థాయిలో అమలు చేస్తోంది..తెలంగాణలో మొన్నటి వరకూ వీక్ గా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు మెల్లె మెల్లెగా బలం పుంజుకుంటోంది..టీఆర్ఎస్ నేతలని కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వనిచడం నుంచీ టీఆర్ఎస్ తిరుగులేని ఆరోపణలు చేయడంలో సక్సెస్ అవుతూనే ఉంది..కాంగ్రెస్ మరింత బలపడటం కోసం ఎప్పుడు గ్రూప్ తగాదాలతో కొట్టుకునే నేతలు ఇప్పుడు కలిసి పనిచేయడం నేర్చుకున్నారు..

ఎన్నికలు దెగ్గర పడుతున్న సమయంలో టీఆర్ఎస్ లో అసమ్మతి రాజేయడమే ఇప్పుడు కాంగ్రెస్ కర్తవ్యం..అందుకే అధికార టిఆర్ఎస్ పార్టీపై మైండ్ గేమ్ పాలిటిక్స్ మొదలు పెట్టింది…అధికార టిఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ వారికి అలుసుగా కనిపించే నాయకుడు ఒక్కడే ఆయనే మంత్రి హరీష్ రావ్..అందుకే కాంగ్రెస్ ఎప్పుడు టార్గెట్ చేసినా సరే హరీష్ రావ్ ని టార్గెట్ చేస్తోంది.. తాజాగా నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హరీష్ రావు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు…కేసిఆర్ రాజకీయాలకి ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తారో అప్పుడు హరీష్ రావు , కేటిఆర్ సీటుకోసం కొట్లాట మొదలుపెడుతారు అని తెలిపారు

టిఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు తీవమైన అవమానాలకి లోనవుతున్నారని ఎవ్వరికీ చెప్పుకోలేక పోతున్నారని వాపోయారు..

హరీష్ రావును అవమానించినట్లే.. తన కొడుకు ని కూడా కేటిఆర్ కొడుకు అవమానిస్తున్నారని కొత్త రకం ఆరోపణలు చేశారు..అయితే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కి నాలుగు ఓట్లు వస్తే అది హరీష్ రావుని చూసి వేయాలని అన్నారు..ఇప్పుడు కొమతరేద్ది చేసిన ఈ కామెంట్స్ రాజకీయవర్గాలో కలకలం రేపుతున్నాయి…అయితే గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణ కూడా హరీష్ రావు కేంద్రంగా టిఆర్ఎస్ పార్టీపై మైండ్ గేమ్ మొదలెట్టారు..కాంగ్రెస్ లోకి హరీష్ రావ్ వస్తే ఆహ్వానిస్తాం అని ప్రకటించేశారు..ఇలా ఒకరి తరువాత మరొకరు టీఆర్ఎస్ పార్టీలో ఎంతో బలంగా ఉన్న హరీష్ ని టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తూ కేసీఆర్ కి దిమ్మతిరిగే కౌంటర్ సిద్దంగా ఉంచుకున్నారని టాక్.మరి టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు చేసే వ్యాఖ్యలని ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.