పవన్ కి తెలంగాణలో ప్రశ్నించే దమ్ము ఉందా –కాంగ్రెస్

పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న నాయకులకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు.తెలంగాణలో టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడం చుసిన కేసీఆర్ ఇప్పుడు పార్టీని కాపాడాలని పవన్ ని అభ్యర్ధించారు.

 T Congress Comments On Pawan Kalyan Telangana Tour-TeluguStop.com

పవన్ కి ఎలాగో హిట్లు లేవు కనుక ఈ పని చేస్తే నాలుగు డబ్బులు వస్తాయని పనిలో పనిగా పార్టీ పెట్టేసి లాలూచి చేసుకుని అధికార పార్టీలకి కొమ్ము కాస్తున్నారు అంటూ చెలరేగిపోయారు కాంగ్రెస్ నాయకులు.అసలు ఒక్కసారిగా వీళ్ళందరూ ఎందుకు

ఇలా పవన్ పై ఎదురు దాడి చేసినట్టు అని ఆలోచిస్తే.

తాజాగా పవన్ కరీమ్లో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి ని దర్శించుకుని అక్కడి నుంచీ నా యాత్ర మొదలు పెడుతాను అని ప్రకటించారు అంటే కాంగ్రెస్ నాయకులు సీరియస్ అయ్యారు.మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.

ఆదివారం కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకించడమే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌నే తాట తీస్తా అన్న పవన్‌ పర్యటనకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు.తెలంగాణాకి వ్యతిరేకంగా ఎన్ని సార్లు పవన్ ప్రకటనలు చేశారు.

అలాంటి పవన్ కి మీకు ఏంటి లాలూచి చెప్పన్దీ అంటూ పొన్నం ఫైర్ అయ్యారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన జేఏసీ చైర్మన్‌ కోదండరాం, పార్లమెంట్‌లో బిల్లును ఆమోదింపజేసిన మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌లు రాష్ట్రంలో పర్యటిస్తే ఆంక్షలు విధించిన ముఖ్యమంత్రి…పవన్‌పై అమిత ప్రేమ చూపించడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు.2009లో ప్రమాదం జరిగితే ఎనిమిదేళ్ల తరువాత ఇప్పుడు మొక్కు గుర్తుకు వచ్చిందా.దేవుడితో కూడా పవన్ రాజకీయాలో చేస్తున్నారు అంటూ మండి పడ్డారు పొన్నం.

పవన్ కి ఎన్నో ఏళ్ల తరువాత తెలంగాణలో ప్రజలు గుర్తుకు వచ్చారా అంటూ ప్రశ్నించారు.ముందు తెలంగాణా పై నీ స్వరం ఎందుకు మారిందో చెప్పు అప్పుడు నిన్ను కరీంనగర్ లో అడుగు పెట్టనిస్తాం అంటూ ఫైర్ అయ్యారు పొన్నం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube