పవన్ నటనలో , రాజకీయాలలో వేస్ట్..కిషన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్     2018-02-14   00:45:43  IST  Bhanu C

పవన్ కళ్యాణ్ నిజంగానే ఫూల్ అయ్యేలా ఉన్నాడు..ఒక పక్క జనసేన అంటాడు మరోపక్క సినిమాలు అంటాడు మళ్లీ “జెఎఫ్ సీ” అంటున్నాడు..అసలు పవన్ కి దిశా దశా ఏమీ తెలియడం లేదా..ఎవరైనా చెప్తే చేస్తున్నాడా అర్థం కాని పరిస్థితి నెలకొంది..తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఎంతో పరుష పదజాలంతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ లా పొగడటం చూస్తుంటే పవన్ కూడా ఓ రాజకీయ నాయకుడే పెద్ద ప్రత్యేకత ఏమి లేదని తెలుస్తోంది..సోషల్ మీడియాలో అయితే ప్రజలు పవన్ ని ఎకి పారేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా పవన్ పై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం కాక రేపుతున్నాయి..ఏకంగా కిషన్ రెడ్డి పవన్ రాజకీయాలకి పనికిరాదు అనేశారు..అంతేకాదు పవన్ కళ్యాణ్ కి యాక్టింగే సరిగా రాదు అంటే మళ్ళీ రాజకీయాలు కూడానా అంటూ ఎద్దేవా చేశారు..చిరంజీవిని అడ్డంపెట్టుకుని నటుడిగా వచ్చిన నువ్వు ముందు యాక్టింగ్ నేర్చుకో..నీకంటే నీ అన్న కొడుకు రాం చరణ్ ఎంతో చక్కగా నటిస్తాడు..అయినా నీ నటన చుస్తే నాకు నవ్వు వస్తుంది అంటూ కిషన రెడ్డి పవన్ టార్గెట్ గా సంచలన కామెంట్స్ చేశారు.

మీడియా సమావేశంలో ఈ రకంగా పవన్ కళ్యాణ్ పై కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు..అంతేకాదు టిడిపి నుంచీ కాంగ్రెస్ లోకి వెళ్లిన రేవంత్ రెడ్డి పై కూడా కిషన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు..రేవంత్ రెడ్డి బీజేపి లోకి వచ్చి ఉంటే వెంటనే వెళ్ళిపోయేవారని అన్నారు..బీజేపి అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని కాంగ్రెస్ లోలా వ్యక్తిగత దూషణలు కుదరదని అన్నారు . వచ్చే ఎన్నికల్లో బీజేపి తెలంగాణలో బలమైన శక్తిగా మారుతుందని అన్నారు..త్వరలోనే అమిత్ షా పర్యటన తెలంగాణా లో ఉంటుందని తెలిపారు..