లంగ్ క్యాన్సర్.బాలీవుడ్ నటుడు సంజయ్ దత్త్ కి వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్కరికి ఈ భయం చుట్టుకుంది.
నెటిజన్లు అంత కూడా లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఏ పార్ట్ దెబ్బ తింటుంది అన్నట్టు గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు.ఇంకా ఈ నేపథ్యంలోనే ఎక్కువమంది లంగ్ క్యాన్సర్ బ్రెయిన్ కి వస్తుందా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా లంగ్ కాన్సర్ మెటాస్టసైజ్ అయ్యే ప్రదేశాలు ఎడ్రినలిన్ గ్లాండ్, బ్రెయిన్, నెర్వస్ సిస్టం, బోన్స్, లివర్, రెస్పిరేటరీ సిస్టమ్.నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ ఉన్న వారిలో 40 శాతం మందికిపైగా లంగ్ క్యాన్సర్ బ్రెయిన్ కి వచ్చే అవకాశం ఉంది.
అయితే లంగ్ క్యాన్సర్ బ్రెయిన్ కి స్ప్రెడ్ అవ్వడాన్ని సమయం తీసుకుంటుంది.
అయితే లంగ్ క్యాన్సర్ ని ముందుగానే గుర్తిస్తే స్ప్రెడ్ అయ్యే ముప్పు ఉండదు.
ఒకవేళ గుర్తించకపోతే స్ప్రెడ్ అయ్యే సమయంలో ఇలాంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి.అవి ఏంటంటే? జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, తలనొప్పి, నీరసం, నిస్త్రాణ, వికారం, వాంతులు, సరిగ్గా నిలబడలేకపోవడం, సరిగ్గా మాట్లాడలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.
లంగ్ క్యాన్సర్ ఉన్నవారిలో ఈ లక్షణాలు లనిపిస్తే వెంటనే డాక్టర్ కి రిపోర్ట్ చేయాలి.వారు వెంటనే స్కాన్స్ చేసి పరిస్థితి ఏంటి అనేది గుర్తిస్తారు.ఇంకా ఈ క్యాన్సర్ కు వయసు లేదు.ఆడ/మగ, చిన్న/పెద్ద ఎవరికైన రావచ్చు.
ట్రీట్మెంట్ చేస్తే జీవితకాలం పెరుగుతుంది.అదే చేయకుంటే ఆరునెలలూ అంతకన్న తక్కువ జీవించగలరు.