సింప‌తీ రాజ‌కీయాలు... బాబుకు సెట్ కావా...?!  

ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకొనే చంద్ర‌బాబుఇప్పుడు సాగిల ప‌డుతున్నారు.ప్ర‌జ‌ల నుంచి పార్టీ నేత‌ల నుంచి ఎదుర‌వుతున్న వ్య‌తిరేక‌త‌తో న‌లి‌గిపోతున్నారు.

TeluguStop.com - Sympathy Politics Doesnot Set For Chandra Babu

ఇది పైకి చెప్ప‌క‌పోయినా చంద్ర‌బాబు కోట‌రీ అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో చెబుతున్న మాట‌.గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయిన త‌ర్వాత‌ తిరిగి టీడీపీని గాడిలో పెట్టేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు పెద్ద‌గా ఫ‌లించ‌డం లేదు.

ఒక‌వైపు స‌ర్కారు దూకుడు, వివిధ ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకుంటున్న విధానం వంటివి వైసీపీకి మార్కులు వేస్తున్నాయి.అయితే టీడీపీ ప్ర‌తిప‌క్షంగా ఉన్న నేప‌థ్యంలో దీనికి మార్కులు వేయించుకునేందుకు, త‌న హ‌వాను తిరిగి నిల‌బెట్టుకునేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు.

TeluguStop.com - సింప‌తీ రాజ‌కీయాలు… బాబుకు సెట్ కావా…-Political-Telugu Tollywood Photo Image

ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఆల‌యాల‌పై జ‌రుగుతున్న వ‌రుస దాడుల‌ను ఆయ‌న టార్గెట్ చేశారు.అయితే ఈ క్ర‌మంలో ఆయ‌న సాధించిన ప్ల‌స్సుల క‌న్నా కూడా మైన‌స్సులే ఎక్కువ‌గా ప‌డ్డాయి.నిన్న మొన్న‌టి వ‌ర‌కు లౌకిక రాజ‌కీయ నేత‌గా పేరున్న చంద్ర‌బాబుకు ఇప్పుడు హిందూత్వ స్టిక్క‌ర్ అంటుకుంది.బ‌హుశ ఈ ప‌రిణామాన్ని చంద్ర‌బాబు ఊహించి ఉండ‌రు.మ‌రోప‌క్క‌, జ‌గ‌న్ దూకుడుగా అమ‌లు చేస్తున్న వివిధ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల్లోకి బాగా వెళ్తున్నాయి.దీంతో ఇప్పుడు అర్జంటుగా చంద్ర‌బాబుకు సింప‌తీ కావాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

అయితే దీనికి ఆయ‌న అవ‌లంబించాల్సిన విధానాలు వేరేగా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

కానీ, తాజాగా చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు సింప‌తీ తీసుకురాలేక‌పోగా ఆయన అనుభ‌వాన్నే ప్ర‌శ్నార్థ‌కం చేసింది అభివృద్ధి చేయ‌డ‌మే నేను చేసిన త‌ప్ప‌యితే క్ష‌మించండి అంటూ చంద్ర‌బాబు సాగిల‌ప‌డ‌డం రాజ‌కీయంగా తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీసింది.ఏం ఆశించి చంద్ర‌బాబు ఈ వ్యాఖ్య‌లు చేశారో తెలియ‌దు కానీ దీనికి భిన్న‌మైన వాద‌న‌, విమ‌ర్శ‌లు మాత్రం వ‌స్తున్నాయి.ఏ పార్టీ అధికారంలో ఉన్నా అభివృద్ది చేయాల్సిందే.

అయితే టీడీపీ హ‌యాంలో ఎవ‌రు అభివృద్ది చెందారు ? అనేది ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌చ్చింది.

టీడీపీ ఎంపీ,  పార్టీ సానుభూతి ప‌రులు, ఎమ్మెల్యేలు బాగుప‌డ్డార‌నే వాద‌న ఇప్పుడు మ‌రోసారి చ‌ర్చ‌కు తీసుకురావ‌డంలో అధికార పార్టీ స‌క్సెస్ అయింది.

ఏం అభివృద్ది చేశార‌ని ఇప్పుడు మొస‌లి క‌న్నీరు కారుస్తున్నారంటూ అధికార ప‌క్షం సంధిస్తున్న ప్ర‌శ్న‌ల‌కు బాబు ద‌గ్గ‌ర స‌మాధానం లేదు.పైగా ఆయ‌న ఆశించిన సింప‌తీ వ‌ర్క‌వుట్ కాక‌పోగా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో స‌గ‌టు ప్ర‌జ‌ల్లో మాత్రం ఆయ‌న భ్ర‌ష్టు ప‌డుతున్నారు.

.

#Chandrababu #TDP Leaders #AP Government #Chandra Babu #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు