సైరా కి డెడ్ లైన్ పెట్టిన రామ్ చరణ్! స్పీడ్ పెంచిన దర్శకుడు  

Sye Raa Narasimha Reddy Shooting Speed Up-ram Charan,shooting Speed Up,surendar Reddy,sye Raa Narasimha Reddy

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా మీద టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. మెగాస్టార్ డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సౌత్ ఇండియా స్టార్ హీరోలతో పాటు, బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమితాబచ్చన్ కూడా కీలక పాత్రలో నటించాడు..

సైరా కి డెడ్ లైన్ పెట్టిన రామ్ చరణ్! స్పీడ్ పెంచిన దర్శకుడు -Sye Raa Narasimha Reddy Shooting Speed Up

దీంతో ఈ సినిమాకి దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలనే కసితో నిర్మాత రామ్ చరణ్ ఉన్నాడు.

ఇప్పటికే చాలా వేగంగా జరుగుతున్నా ఈ సినిమా షూటింగ్ తాజాగా కొన్ని సెట్స్ నిర్మాణం కారణంగా కొంత గ్యాప్ తీసుకుంది.

ఇప్పుడు కోకాపేట్ లో వేసిన భారీ కోట సెట్స్ లో షెడ్యూల్ కి రెడీ అవుతుంది. ఈ కోటలో ఏకంగా 11 రోజుల పాటు షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే సినిమాని వీలైనంత వేగంగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పైన ద్రుష్టి పెట్టాలని, ఈ సినిమాతో గట్టిగా ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే సురేందర్ రెడ్డి కి రామ్ చరణ్ ఇప్పటికే చెప్పడం జరిగిందని తెలుస్తుంది. దీంతో ఈ సినిమా కోసం రాత్రి పగలు అనకుండా దర్శకుడు సురేందర్ పనిచేస్తున్నాడని తెలుస్తుంది.

మరి వేల మంది కష్టంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులని ఎ స్థాయిలో మెస్మరైజ్ చేస్తుందో వేచి చూడాలి.