బర్త్‌డే సందర్బంగా 'సైరా' విడుదల తేదీ ప్రకటన  

Sye Raa Narasimha Reddy Release Date Announcement On Charan Birthday-march 27th,ram Charan Birthday,sahoo Movie,sye Raa Narasimha Reddy Release Date

  • మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి సినిమా విడుదల తేదీపై గత కొన్నాళ్లుగా గందరగోళం నెలకొన్న విషయం తెల్సిందే. ఈ ఏడాది సమ్మర్‌లోనే సినిమా రావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు సినిమా విడుదల తేదీపై ఒక క్లారిటీ ఇచ్చేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు సిద్దం అయ్యారు. ముందుగా ఆగస్టు 15న చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. కాని అదే రోజు సాహో విడుదల చేయనున్నారు.

  • సాహో విడుద కానున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ రోజు కాదు కదా, కనీసం ఆ వారంలో కూడా వచ్చే అవకాశం లేదు. కనీసం రెండు మూడు వారాల తేడా అయినా ఉండాలని భావిస్తున్నారు. ఇప్పటికే సైరా కోసం ఒక తేదీని చిత్ర యూనిట్‌ సభ్యులు అనుకున్నారని, దాన్ని చరణ్‌ బర్త్‌డే అయిన ఈనెల 27న ప్రకటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన ఒక చిన్న పోస్టర్‌ను కూడా విడుదల చేయబోతున్నారు.

  • Sye Raa Narasimha Reddy Release Date Announcement On Charan Birthday-March 27th Ram Birthday Sahoo Movie

    Sye Raa Narasimha Reddy Release Date Announcement On Charan Birthday

  • మొదట చరణ్‌ బర్త్‌డే సందర్బంగా రాజమౌళి మల్టీస్టారర్‌ చిత్రం నుండి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తారని అంతా భావించారు. కాని రాజమౌళికి ఆ ఆలోచనే లేదట. సినిమా విడుదలకు ఇంకా సంవత్సరంకు ఎక్కువ సమయం ఉంది. అలాంటి సమయంలో ఎందుకు ఫస్ట్‌లుక్‌ ఇప్పుడే విడుదల చేయాలని జక్కన్న భావిస్తున్నాడట. త్వరలోనే రాజమౌళి సినిమా కొత్త షెడ్యూల్‌ కోల్‌కతాలో జరుగబోతున్న విషయం తెల్సిందే. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.