చిరుకు ఛాన్స్‌ ఇవ్వని 'సాహో'... ప్రభాస్‌ దెబ్బకు డేట్‌ మార్చేశారు  

Sye Raa Narasimha Reddy Movie Release Date Postponed-prabhas,sahoo Movie Release Date,sye Raa Narasimha Reddy Movie

మెగా ఫ్యాన్స్‌ కన్ఫ్యూజన్‌కు తెర పడింది. గత కొన్ని రోజులుగా ‘సైరా నరసింహారెడ్డి’ తేదీపై నెలకొన్న సందిగ్దంకు బ్రేక్‌ పడ్డట్లయ్యింది. సైరా చిత్రంను మొదట స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఆగస్టు 15న విడుదల చేయాలని భావించారు. కాని అదే రోజున ప్రభాస్‌ సాహో చిత్రం విడుదల అవుతోంది. ఇటీవలే సాహో చిత్రంకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది..

చిరుకు ఛాన్స్‌ ఇవ్వని 'సాహో'... ప్రభాస్‌ దెబ్బకు డేట్‌ మార్చేశారు-Sye Raa Narasimha Reddy Movie Release Date Postponed

దాంతో సాహో సినిమా విడుదల తేదీని మార్చాల్సిన పరిస్థితి వచ్చింది.

సాహో విడుదల తేదీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో గాంధీ జయంతి రోజున ఈ చిత్రం రాబోతుందని క్లారిటీ వచ్చేసింది. సినిమాకు ఎలాంటి పోటీ లేకుండా సాఫీగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆగస్టులో సినిమాను విడుదల చేయడం లేదని, సెప్టెంబర్‌లో ఇతర సినిమాలు ఉన్న కారణంగా అక్టోబర్‌ 2న సినిమాను విడుదల చేయాలని రామ్‌ చరణ్‌ నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

సైరా చిత్రం షూటింగ్‌ పూర్తి అవ్వబోతుంది. అతి త్వరలోనే ఆ మిగిలి ఉన్న బ్యాలన్స్‌ను పూర్తి చేసి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌లోకి వెళ్లబోతున్నారు. అతి త్వరలోనే సినిమా ఫస్ట్‌కాపీని సిద్దం చేయబోతున్నారు.

రీ షూట్స్‌ ఏమైనా ఉంటే ఆగస్టులో చేసే అవకాశం ఉందని అంటున్నారు. చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన ఈ చిత్రంకు సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించగా, రామ్‌ చరణ్‌ నిర్మించాడు. చిరు కెరీర్‌లో ఇది 151వ చిత్రం అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.