'సైరా'ను లైట్‌ తీసుకుంటున్న బయ్యర్లు... టెన్షన్‌లో రామ్‌ చరణ్‌  

Sye Raa Narasimha Reddy Getting Buyyer Problem-chirnjeevi,chirnjeevi 151th Movie,nayanatara,ram Charan,sye Raa Narasimha Reddy

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది. దాదాపుగా 200 కోట్ల బడ్జెట్‌ ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. మొదట ఈ చిత్రంకు 100 కోట్లు అనుకున్నారు. ఆ తర్వాత 150 కోట్లు ఖర్చు చేయాలని భావించారు, చివరకు 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో సైరా పూర్తి అయ్యింది. 200 కోట్ల బడ్జెట్‌ రికవరీ ప్రస్తుతం సాధ్యమేనా అంటూ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. తాజాగా ఈ చిత్రం హక్కుల అమ్మకం గురించిన వార్తలు సినీ వర్గాల్లో ప్రచారం జరుగోతోంది..

'సైరా'ను లైట్‌ తీసుకుంటున్న బయ్యర్లు... టెన్షన్‌లో రామ్‌ చరణ్‌-Sye Raa Narasimha Reddy Getting Buyyer Problem

చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం.150 మంచి విజయాన్ని సాధించి 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దాంతో ఈ చిత్రం బిజినెస్‌ కనీసం 150 కోట్లు అవుతుందని నిర్మాత రామ్‌ చరణ్‌ ఆశ పడ్డాడు. కాని పరిస్థితి చూస్తుంటే అంత స్థాయిలో పెట్టేందుకు బయ్యర్లు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌ మరియు డబ్బింగ్‌ రైట్స్‌ అన్ని కలిపి కూడా 100 కోట్ల వరకు అమ్ముడు పోయే పరిస్థితి లేదు. ఇక శాటిలైట్‌ రైట్స్‌ మరియు ప్రైమ్‌ వీడియో రైట్స్‌ ఇతర రైట్స్‌ ద్వారా మరో 50 కోట్ల వరకు రాబట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే మొత్తంగా 150 కోట్లకు మించి వచ్చేయ అవకాశమే లేదు.

ఇలాంటి సమయంలో సైరా చిత్రం 50 కోట్ల లోటుతోనే విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం 200 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ అయితే నిర్మాత చరణ్‌ ఎలాంటి టెన్షన్‌ లేకుండా సినిమాను విడుదల చేసేవాడు. కాని సినిమా విడుదల సమయంలో చరణ్‌ టెన్షన్‌ తప్పదని సినీ వర్గాల వారు అంటున్నారు.

సైరా వంటి భారీ చిత్రం సక్సెస్‌ అయితే పర్వాలేదు. కాని ఫలితం తేడా కొడితే మాత్రం బయ్యర్లు మరియు నిర్మాత చరణ్‌కు గట్టి దెబ్బ తప్పదని సినీ వర్గాల వారు అంటున్నారు.