సైరా ఇంకా ఎన్ని కోట్ల దూరం వెళ్లాలి  

Sye Raa Narasimha Reddy Collections Huge Loss To Buyers-chiranjeevi,huge Loss To Buyers,sye Raa Movie Budget,sye Raa Movie Collections

చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి కలెక్షన్స్‌ మందగించాయి.తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్లను రాబట్టి మంచి విజయం సాధించింది.కాని ఇతర ప్రాంతాల్లో మాత్రం ఈ చిత్రం డిజాస్టర్‌ లెక్కలో పడిపోయింది.ముఖ్యంగా హిందీలో 30 కోట్ల బిజినెస్‌ చేసిన ఈ చిత్రం కేవలం 5.5 కోట్లను మాత్రమే వసూళ్లు చేసింది.దారుణమైన ఈ కలెక్షన్స్‌తో హిందీ బయ్యర్లు కళ్లు తిరిగి పడిపోతున్నారు.మినిమం పాతిక కోట్లు అయినా రాబడుతుందని అంతా అనుకున్నారు.కాని పరిస్థితి తారు మారు అయ్యింది.

Sye Raa Narasimha Reddy Collections Huge Loss To Buyers-chiranjeevi,huge Loss To Buyers,sye Raa Movie Budget,sye Raa Movie Collections-Sye Raa Narasimha Reddy Collections Huge Loss To Buyers-Chiranjeevi Huge Buyers Sye Movie Budget

చిరంజీవి బాలీవుడ్‌లో జీరో క్రేజ్‌ అని మరోసారి చెప్పకనే చెప్పింది.ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 200 కోట్ల బిజినెస్‌ను చేసింది.కాని లాంగ్‌ రన్‌లో ఈ చిత్రం 150 కోట్లకు మించి వసూళ్లు చేసే పరిస్థితి కనిపించడం లేదు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ చిత్రం 140 కోట్ల వసూళ్లు రాబట్టింది.మరో 10 కోట్ల వరకు వసూళ్లను సాధిస్తుంది.ఆ తర్వాత లెక్క చూస్తే 50 కోట్ల నష్టం ఈ చిత్రంకు ఉంటుందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Sye Raa Narasimha Reddy Collections Huge Loss To Buyers-chiranjeevi,huge Loss To Buyers,sye Raa Movie Budget,sye Raa Movie Collections-Sye Raa Narasimha Reddy Collections Huge Loss To Buyers-Chiranjeevi Huge Buyers Sye Movie Budget

 సినిమాను 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన కారణంగా బయ్యర్లకు భారీ మొత్తానికి అమ్మడం జరిగింది.150 కోట్ల బిజినెస్‌ చేసి ఉంటే బాగుండేదని అంతా అనుకుంటున్నారు.సినిమా భారీ వసూళ్లను రాబట్టినా ఇంకా లోటు వసూళ్లనే కలిగి ఉండటం, బయ్యర్లకు 50 కోట్ల నష్టం వాటిల్లడం వంటి కారణాలతో సైరా సినిమా ఫ్లాప్‌ జాబితాలోకి పోయింది.తెలుగు రాష్ట్రాల్లోమాత్రం ఈ చిత్రం సూపర్‌ హిట్‌ వసూళ్లను నమోదు చేసింది.ఈ ఫలితంతో అయినా చిరు తర్వాత సినిమాల బడ్జెట్‌ నియంత్రణలో ఉంటుందేమో చూడాలి.