అప్పుడు నైరా అన్నారు.. ఇప్పుడు సైరా కొడుతున్నారు

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మూవీ సైరా నరసింహారెడ్డి ఇటీవల రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు.

 Sye Raa Getting Super Response In Ott Digital Format-TeluguStop.com

అయితే సరైన ప్రమోషన్స్ లేని కారణంగా తెలుగులో తప్పితే మరే ఇతర భాషల్లో ఈ సినిమా చెప్పుకోతగ్గ విజయం నమోదు చేసుకోలేదు.

కాగా ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో ఇటీవల రిలీజ్ చేశారు.

ఈ సినిమాకు డిజిటల్ ప్లాట్‌ఫాంలో మంచి ఆదరణ లభిస్తోంది.తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం ప్రేక్షకులు ఇప్పుడు సైరా సినిమాను బాగా చూస్తున్నారని తెలుస్తోంది.దాదాపు రూ.30 కోట్లకు అమెజాన్ ప్రైమ్ సైరా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది.ప్రస్తుతం వీక్షిస్తున్న ఆడియెన్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అమెజాన్ ప్రైమ్ భావిస్తోంది.

ఏదేమైనా చిరు 151వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేశారు.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో చేయనున్నాడు.

ఈ సినిమాను అతి త్వరలో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube