ఎన్టీఆర్ చనిపోయే ముందు లక్ష్మీ పార్వతి గురించి అలా చెప్పారట !

ఒకప్పుడు కృష్ణం రాజు గారితో ఫొటో కోసం అప్పట్లోనే 100 రూపాయలు ఖర్చు పెట్టిన కొద్దిరోజుల్లో ఆయన తోనే బంధుత్వం ఏర్పడుతుందని తెలీదన్నారు నాగ రాజు. నటుడు కృష్ణం రాజు అంటే ఎనలేని అభిమానం అన్న నాగరాజు ఆయన సౌమ్యుడు, అందరితోనూ సరదాగా ఉంటారని అన్నారు.

 Sye Raa Chiranjeevi Grand Father Nagaraju About Ntr Last Days With Wife Lakshmi-TeluguStop.com

అటు ఇండస్ట్రీలో, ఇటు రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకున్నారని ఆయన తెలిపారు.తొందర్లోనే కృష్ణం రాజుకు గవర్నర్ పదవి ఇస్తారనే వార్తలొస్తున్నాయి.

అది నిజం కావాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.

రెబల్ స్టార్ ప్రభాస్ తోను మంచి సన్నిహిత్యం ఉందని ప్రస్తుతమున్న బెస్ట్ హీరో లలో ఒకరని నాగరాజు అన్నారు.

తమ కాలమో జయ మాలిని డ్రీమ్ గర్ల్ ఐతే ఈ కాలంలో అమ్మాయిలకు ప్రభాస్.డ్రీమ్ బోయ్ అని ఆయన తెలిపారు.

అంతే కాకుండా… ప్రభాస్ మంచి పేరున్న దర్శకులతో చేసి.మంచి స్థాయిలో ఉన్నారని కానీ అది నిలబెట్టు కోగలిగితెనే దానికి విలువ అని ఆయన అన్నారు.

ఇక ప్రేక్షకులంతా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయం అదే ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? ఎవర్ని చేసుకుంటారు అన్న ప్రశ్నలకు నాగరాజు ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

Telugu Krishnam Raju, Nagarjuna, Ntr Day, Prabhas Love, Prabhas, Tollywood-Movie

ప్రస్తుతం ప్రభాస్ చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నారనీ ఈ ఇయర్ లేదా నెక్స్ట్ ఇయర్ తప్పకుండా వివాహం అవుతుందని ఆయన… అభిమానులకు ఒక క్లారిటీ ఇచ్చారు.ఇక ప్రభాస్ ఎవర్నో ప్రేమించారని అది ఇంట్లో ఒప్పుకోక పోవడమే… అతని పెళ్లి లేట్ కావడానికి కారణమని వస్తున్న వార్తలపై నాగరాజు స్పందించారు.ఒక వేళ అదే నిజం అయితే గనక… మమ్మల్ని అందర్నీ ఒప్పించే చేసుకుంటారని నమ్మకం ఐతే ఉందని ఆయన అన్నారు.

ఆ వార్తలు నిజం ఐతే నేనే వెళ్లి మాట్లాడుతానని ఆయన తెలిపారు.

Telugu Krishnam Raju, Nagarjuna, Ntr Day, Prabhas Love, Prabhas, Tollywood-Movie

సీనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం అన్న నాగరాజు.ఆయన ఎంతో నిబద్దత, పట్టుదల కలిగిన వ్యక్తి అని అన్నారు.తన తండ్రి మాట మేరకు.

ఎన్టీఆర్ కి పెరాలసిస్ వచ్చిన తర్వాత … ఆయన భోజనానికి సంబందించిన అన్ని ఏర్పాట్లను తామే చూసుకునే వారమని నాగరాజు తెలిపారు.ఆ స్థితిలోనూ.ఆయన తాను మామూలు స్థితికి వచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేసేవారని వివరించారు.ఇక లక్ష్మి పార్వతి గారు ఉన్నప్పుడు మాత్రం తాము భోజనం ఏర్పాట్లలో కొంచెం మార్పులు చేసే వారమని ఆయన అన్నారు.

అది చూసి ఎన్టీఆర్ ” ఏంటీ ఈరోజు టేస్ట్ తగ్గింది” అనే వారని… దానికి తాము… లక్ష్మీ పార్వతి గారి మాట మేరకు అలా చేసే వాళ్ళమని నాగరాజు చెప్పారు.దానికి ఎన్టీఆర్… ” చేయటం రాదు… అంతకంటే ఎక్కువ తినదు.

మీ పని మీరు చేయండి.మీ టేస్ట్ పోవద్దు” అని అనేవారని నాగరాజు తెలిపారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube