సైరా భారీ విజయం అయినా భారీ నష్టాల్లో బయ్యర్లు  

Sye Raa Buyers Have Too Much Loss About This Film-nayanatara,sye Raa,sye Raa Narasimha Reddy Movie Collections,tamanna,tollywood Box Office Collections,vijay Sethupathi

చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ దాదాపుగా 275 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు మంచి బజ్ రావడంతో సినిమాను దాదాపుగా 200 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల అవుతుంది కనుక ఈజీగానే వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం అనుకున్నారు.

Sye Raa Buyers Have Too Much Loss About This Film-nayanatara,sye Raa,sye Raa Narasimha Reddy Movie Collections,tamanna,tollywood Box Office Collections,vijay Sethupathi-Sye Raa Buyers Have Too Much Loss About This Film-Nayanatara Sye Narasimha Reddy Movie Collections Tamanna Tollywood Box Office Vijay Sethupathi

సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది.కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో సినిమా 70 కోట్లను క్రాస్ చేసింది.ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 100 కోట్లను రాబట్టింది.లాంగ్ రన్ లో మరో 25 నుండి 30 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉంది.అంటే మొత్తంగా సినిమా 125 నుండి 130 కోట్ల షేర్ ను రాబట్టనుంది.అంటే సినిమాకు 75 కోట్ల మేరకు నష్టాలు తప్పేలా లేవని ట్రేడ్ వర్గాల వారు విశ్లేషిస్తున్నారు.

Sye Raa Buyers Have Too Much Loss About This Film-nayanatara,sye Raa,sye Raa Narasimha Reddy Movie Collections,tamanna,tollywood Box Office Collections,vijay Sethupathi-Sye Raa Buyers Have Too Much Loss About This Film-Nayanatara Sye Narasimha Reddy Movie Collections Tamanna Tollywood Box Office Vijay Sethupathi

తెలుగు రాష్ట్రాల్లో సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది.కానీ ఇతర ప్రాంతాల్లో మాత్రం తేలిపోయింది.us లో సినిమా కనీసం 4 లేదా 5 మిలియన్ దాలర్లను రాబట్టడం ఖాయం అనుకున్నారు.కానీ పరిస్థితి చూస్తుంటే అంత సీన్ లేదనిపిస్తుంది.సినిమాకు వచ్చిన ఇతర రైట్స్ ద్వారా నిర్మాత రాం చరణ్ సేఫ్ అవ్వడం ఖాయం.

కానీ బయ్యర్లు మాత్రం బలి అవ్వడం ఖాయం అంటూ ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.