'ఇండియా' వెన్నులో వణుకు!!

భారత దేశానికి మహమ్మారిలా మారింది ‘స్వయిన్ ఫ్లూ’.ఆ పేరు వింటేనే భారత దేశం వణికిపోతుంది.

 Swine Flu Threats To India-TeluguStop.com

ఈ సీజన్ లో ఇప్పటి వరకు సుమారు 6వందల మందికిపైగా పొట్టనపెట్టుకుంది.వేల మంది ఆస్పత్రిలో వ్యాధి లక్షణాలతో చికిత్సపొందుతున్నారు.

గుజరాత్‌, రాజస్థాన్‌లో హెచ్‌1 ఎన్‌1 వైరస్‌ బెంబేలెత్తిస్తోంది.వ్యాధి నియంత్రణ ఔషధం విధిగా ఉండాలని మందుల దుకాణాలకు జాతీయ ఔషధ నియంత్రణ మండలి సూచించింది.

వైద్యుని సలహా మేరకే అమ్మాలని… ఆ ప్రిస్క్రిప్షన్‌నూ నకలనూ తీసుకోవాలని తెలిపింది.ఉత్తరాదిలో స్వైన్ ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉంది.

చల్లని గాలులకు వ్యాధి త్వరగా వ్యాపిస్తోంది.రెండు రోజుల్లోనే సుమారు 40 మంది ఈ వ్యాధి లక్షణాలతో మృతి చెందినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ఇప్పటి వరకు ఈ వ్యాధితో సుమారు 624 మంది మృతి చెందారు.దేశవ్యాప్తంగా సుమారు పది వేల మందికి వ్యాధి సోకినట్టు అధికారులు గుర్తించారు.

గతంతో పోలిస్తే ఇది కాస్త ఆందోళన కలిగించే సంఖ్యగా చెబుతున్నారు.స్వైన్‌ ఫ్లూతో గతేడాది 218 మంది చనిపోయారు.

స్వైన్‌ ఫ్లూ విజృంభణపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు .వ్యాధి వ్యాప్తిపై సమీక్ష నిర్వహించారు.రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని వ్యాధి మరింతగా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube