హెల్త్ అలెర్ట్ : తెలంగాణాలో పెరుగుతున్న స్వైన్ ఫ్లూ కేసులు !

మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక రకాల వ్యాధులు విజృంభిస్తున్నాయి.ముఖ్యంగా స్వైన్ ఫ్లూ వ్యాధి .చల్లని వాతావరణం ఎక్కువగా ఉండడంతో ఈ వ్యాధి విజృంభణ ఏక్కువవుతోంది.ముఖ్యంగా… తెలంగాణాలో ఈ ఎక్కువగా విజృంబిస్తున్నట్టు ప్రభుత్వానికి నివేదికలు అందుతున్నాయి.ఇప్పటికే… స్వైన్‌ప్లూతో గాంధీ ఆస్పత్రిలో ఒకరు మృతి చెందారు.ఇంకా ఇద్దరు వైర్‌సతో చికిత్స పొందుతున్నారు.

 Swine Flu Casess Are Growing In Telangana-TeluguStop.com

ఇక ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైరస్‌ లక్షణాలతో వచ్చే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోందని వైద్య వర్గాలు వెల్లడిస్తున్నాయి.

వైరస్‌ సాధారణంగా 35 నుంచి 40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో ఎక్కువ సేపు బతకదని, 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో శక్తివంతంగా ఉంటుందని వైద్యులు వివరిస్తున్నారు.ప్రస్తుతం నగరంలో గరిష్ఠం 20.9, కనిష్ఠం 15.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంది.రాత్రి, ఉదయం పూట చల్లగా ఉం డడం, చలిగాలులు వీస్తుండడంతో వైరస్‌ బలంగా తయారవుతోందని వైద్యులు పేర్కొంటున్నారు.

ఈ వైరస్‌ లక్షణాలున్న వారు బయట తిరగడంతో ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సులువుగా సంక్రమిస్తోంది.

ఆయాస పడటం లేదా శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కోవటం, జ్వరం అనేవి సాధారణ స్వైన్ ఫ్లూ లక్షణాలు.వీటితోపాటు కొంతమందికి ఒళ్లు నొప్పులు, ముక్కు కారటం, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, వాంతులు, విరేచనాలు.లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.

ముఖ్యంగా వేగంగా శ్వాస తీసుకోవటం, నీరు తాగటంలో లేదా ఆహారం మింగటంలో ఇబ్బంది ఏర్పడటం, జ్వరం, తీవ్రంగా దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తే స్వైన్ ఫ్లూగా భావించి అవసరమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించి, తగిన వైద్యాన్ని అందించాల్సి ఉంటుంది.

గాంధీ ఆస్పత్రికి హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌, జగిత్యాల జిల్లాల నుంచి వైరస్‌ బారిన పడిన కేసులు ఎక్కువగా వస్తున్నాయి.హైదరాబాద్‌ జిల్లాలో ఈ నెలలో గడిచిన పదిహేడు రోజుల్లో 36 మందికి వైరస్‌ వచ్చింది.అందులో ముగ్గురు మృతి చెందారు.

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు హైదరాబాద్‌ జిల్లాలో 371 మందికి వైరస్‌ సోకింది.దీంతో ఈ వ్యాధిపట్ల అవగాహన పెంచుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube