స్వైన్ ఫ్లూ వచ్చింది అంటూ.. ఓ గ్రామం వెలి ..?  

Swine Flu Came From .. A Village Boycott .. Other Villegers -

ప్రస్తుతం ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ వ్యాధి విస్తరిస్తోంది.శీతాకాలంలో ఈ వ్యాధి మరింత విస్తరించే అవకాశం ఉండడంతో… వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రజలను అప్రమత్తం చేస్తూ… పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు.

Swine Flu Came From .. A Village Boycott .. Other Villegers

ఇప్పటికే పలు చోట్ల స్వైన్ ఫ్లూ సోకిన కేసులు నమోదయ్యాయి.ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా రెండు కేసులు నమోదు అయ్యాయి.

అయితే ఈ వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో… ప్రజల్లో కూడా అపోహలు పెరిగిపోతున్నాయి.తాజాగా …కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని చింతకోళ్ల గ్రామంలో స్వైన్‌ఫ్లూ ప్రబలిందన్న అనుమానంతో ఆ గ్రామాన్ని చుట్టుపక్కల గ్రామాలు వెలివేశాయి.

కొద్ది రోజుల క్రితం చింతకోళ్లలో పేరే మరియమ్మ(32) అనే మహిళ అంతుచిక్కని వ్యాధితో మృతి చెందింది.ఆమె మృతికి స్వైన్ ఫ్లూ కారణమని.చింతకోళ్ల గ్రామం అంతటా వైరస్‌ వ్యాపించిందని పుకార్ల మొదలయ్యాయి.ఈ క్రమంలో చింతకోళ్ల ప్రజలతో సమీప గ్రామాల ప్రజలు మాట్లాడడం కూడా మానేశారు.ఆ గ్రామానికి చెందిన విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సెలవులు ప్రకటించాయి.గ్రామానికి పాలు పోయాడానికి వచ్చేవారు కూడా పాల సరఫరా నిలిపివేశారు.

హోటల్ లో టిఫిన్ కోసం వెళితే హోటల్ కి రావద్దు అని హోటల్‌ సిబ్బంది పంపేస్తున్నారు.చింతకోళ్ల గ్రామస్థులు ఆర్టీసీ బస్సులెక్కితే దిగిపోవాలంటూ తోటి ప్రయాణికులు గొడవ చేస్తున్నారు.

ఈ సామజిక వెలి కారణంగా ఆ గ్రామస్థులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Swine Flu Came From .. A Village Boycott .. Other Villegers- Related....