నడిరోడ్డుపై స్విమ్మింగ్‌ పూల్.. స్నానం చేసి వ్యక్తి నిరసన

మన దేశంలో కాంట్రాక్టర్ల పుణ్యమా అని రోడ్డు వేసిన కొన్ని రోజులకే అవి పాడవుతాయి.పెద్ద పెద్ద గుంతలు దర్శనమిస్తాయి.

 Swimming Pool On The Road Person Protests After Taking A Bath , Road, Swimming Pool, Bath, Yoga, Exercise, Viral Latest, News Viral, Social Media, Video Viral-TeluguStop.com

ఫలితంగా చాలా మంది వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురై, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.కనీసం వాటికి మరమ్మతులు చేయించాలన్నా పాలకులకు మనసు ఒప్పడం లేదు.

కొన్ని రాజకీయ పార్టీలు ఇలాంటి సమస్యలపై ఉద్యమిస్తుంటాయి.అయితే వాటిని పాలక పార్టీలు రాజకీయ ఎత్తుగడగా తిప్పికొడుతుంటాయి.

 Swimming Pool On The Road Person Protests After Taking A Bath , Road, Swimming Pool, Bath, Yoga, Exercise, Viral Latest, News Viral, Social Media, Video Viral -నడిరోడ్డుపై స్విమ్మింగ్‌ పూల్.. స్నానం చేసి వ్యక్తి నిరసన-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఏ మాత్రం సమస్యకు పరిష్కారం చూపవు.ఆ గుంతలు పడిన రోడ్లపై ప్రయాణిస్తూ, చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నా ప్రభుత్వాలు చలించడం లేదు.

అయితే పాలకులకు కనువిప్పు కలిగించేలా ఓ వ్యక్తి నిరసన చేపట్టాడు.నడిరోడ్డులో వర్షాలకు స్విమ్మింగ్‌పూల్ లాంటిది ఏర్పడగా, అక్కడే స్నానం చేసి నిరసన చేపట్టాడు.

దెబ్బకు ప్రభుత్వం దిగి వచ్చేలా చేశాడు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

కేరళలో ఇటీవల రోడ్లు పాడై, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.ఎర్నాకులంలోని నెడుంబస్సేరి వద్ద ఇలాంటి ఓ గుంతలో పడి ఓ వాహనదారుడు ప్రాణాలు కోల్పోయాడు.దీంతో మలప్పురం ప్రాంతంలో హంజా పొరాలి అనే వ్యక్తి దీనిపై వినూత్న రీతిలో నిరసన చేపట్టాడు.బురద నీటిలో స్నానం చేశాడు.

అక్కడే తన బట్టలు ఉతికాడు.ఇలా తన నిరసనను ప్రభుత్వానికి తెలిపాడు.

ఈ విషయం మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అయింది.ఇది చివరికి ఆ రాష్ట్ర హైకోర్టుకు చేరింది.

దీంతో వెంటనే హైకోర్టు స్పందించింది.ఆ ప్రాంతంలో రోడ్లు వెంటనే బాగు చేయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

జస్టిస్ దేవన్ రామచంద్రన్‌తో కూడిన సింగిల్ బెంచ్ రోడ్ల నిర్మాణంపై నేషనల్ హైవే అథారిటీకి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది.ప్రమాదకర రహదారులను వెంటనే మరమ్మతులు చేయించాలని సూచించింది.

అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు దీనిపై స్పందించాలని పేర్కొంది.ఇలా ఒక్కడు చేపట్టిన నిరసన ఏకంగా ప్రభుత్వాన్నే కదిలించగలింది.

ఈ వ్యక్తిని నెటిజన్లు మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.Hi

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube