శ్వేతారెడ్డి, గాయత్రి గుప్త ఇచ్చిన ఫిర్యాదు ఎంక్వౌరీ ఎక్కడికి వచ్చింది?  

Swetha Reddy And Gayatri Gupta Appeal To Ncw To Ban Big Boss-

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 నిర్వాహకులు తమను వేదించారు అంటూ శ్వేతా రెడ్డి మరియు గాయత్రి గుప్తలు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే.పోలీసులు పెద్దగా పట్టించుకోని కారణంగా ఏకంగా జాతీయ మహిళ కమీషన్‌ ముందుకు వీరిద్దరు వెళ్లారు.పంచాయితీ ఢిల్లీ వరకు వెళ్లడంతో స్టార్‌ టీవీ నిర్వాహకులు స్పందించారు.వీరిద్దరితో చర్చలు జరిపి అంతర్గతంగా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారట...

Swetha Reddy And Gayatri Gupta Appeal To Ncw To Ban Big Boss--Swetha Reddy And Gayatri Gupta Appeal To NCW Ban Big Boss-

ఈ విషయమై శ్వేతా రెడ్డి స్పందిస్తూ తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లుగా పేర్కొంది.

స్టార్‌ టీవీ ముంబయి హెడ్‌ ఇప్పటికే మాతో టచ్‌లో ఉన్నాడని, పలు విషయాలను తెలుసుకుంటున్నారని, ఆయన మాతో తప్పుగా ప్రవర్తించిన వారి వివరాలను సేకరించాడంటూ చెప్పుకొచ్చింది.మాకు ఇబ్బంది కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటానంటూ ఆయన హామీ ఇచ్చాడు.

Swetha Reddy And Gayatri Gupta Appeal To Ncw To Ban Big Boss--Swetha Reddy And Gayatri Gupta Appeal To NCW Ban Big Boss-

ఆయన మాటలు నేను నమ్ముతున్నాను.తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను.కాస్టింగ్‌ కౌచ్‌ సినిమాతో పాటు ఇలాంటి కార్యక్రమాల్లో కూడా ఉంటే మాలాంటి వారి పరిస్థితి ఏంటీ అంటూ ఆమె ప్రశ్నిస్తుంది.

మరో వైపు హైదరాబాద్‌ పోలీసులు కూడా ఈ కేసు విషయమై పలువురిని ప్రశ్నించారు.వారి నుండి సమాచారం రాబట్టారు.పోలీసులు కూడా తమకు న్యాయం కలిగేలా చర్యలు తీసుకుంటున్నందుకు సంతోషంగా ఉందని శ్వేతారెడ్డి ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది.మొత్తానికి బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ప్రారంభం అయ్యింది.అయినా వివాదం మాత్రం కొనసాగుతుంది.

ఇప్పటికే ప్రారంభం అయ్యింది కనుక ఎలాంటి వివాదంకు అయినా షో ఆగిపోయే అవకాశం లేదు.