ఆ జిల్లాలో శ్వేతనాగు దర్శనం.. ఎక్కడంటే?

మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా అన్ని ప్రాంతాలలో పండగ వాతావరణం చోటు చేసుకుంది.అంతేకాకుండా ప్రతి ఒక్క శివాలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

 Swetha Naagu Appeared On Mahashivratri In Mancherial District Swetha Naagu, Maha-TeluguStop.com

శివరాత్రి సందర్భంగా శివపార్వతుల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగాయి.ఇక భక్తులు ఉపవాసాలు ఉంటూ శివనామ స్మరణ భక్తిలో మునిగారు.

ఆ మహా శివుడికి ప్రత్యేక పూజలు చేస్తూ తమ మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు.ఇదిలా ఉంటే శివరాత్రి రోజు శ్వేత నాగు దర్శనంతో ఓ అద్భుతం జరిగింది.

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మునిసిపాలిటి పరిధిలో ఓ అద్భుతం జరిగింది.సాక్షాత్తు ఆ మహా శివుడు పంపినట్లుగా అది కూడా శివరాత్రి రోజు శ్వేత నాగు దర్శనమిచ్చి భక్తులను సంతోషంలో మంచిది.

ఆ ప్రాంతంలో కోర్టు ఆవరణంలో ఉన్నా పసుపునుటి సంతోష్ అనే వ్యక్తి ఇంటి పరిధిలో మహా శివుడి కంఠాభరణం అయినా శ్వేత నాగు దర్శనమిచ్చింది.

ఇక శ్వేతనాగు ని చూసిన ఆ కాలనీవాసులు ఆశ్చర్యపోయారు.

అంతేకాకుండా ఆ పాముకు భక్తితో పూజలు చేశారు.పాలు, గుడ్లు సమర్పించారు.

ఇక ఆ పాము కూడా భక్తులు పోసిన పాలు తాగడమే కాకుండా ఎటువంటి హాని చేయలేదు.తెల్లటి వర్ణంతో ఉన్న ఆ పాము పడగ విప్పి భక్తులను ఆశీర్వదించినట్లుగా ఉంది.

ఇక మహాశివరాత్రి పర్వదినాన శ్వేతనాగు దర్శనమివ్వడం వల్ల తమ జన్మ ధన్యమైందని అక్కడ ఉన్న కోర్టు రోడ్డు కాలనీ వాసులు, క్లబ్ వాసులు సంతోషంతో తెలుపుతున్నారు.ఇక ఈ విషయాన్ని తెలుసుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతం వారంతా పెద్ద ఎత్తున శ్వేత నాగు ను దర్శించుకోవడానికి తరలివచ్చారు.

మొత్తానికి శివరాత్రి రోజు ఆ ప్రాంత వాసులు శ్వేత నాగు దర్శనం వల్ల అదృష్టాన్ని కొనితెచ్చుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube