పెళ్లి పెటాకులయ్యాక ప్రేమ కబుర్లు చెబుతున్న పాప  

swetha basu prasad wants to love again - Telugu Kotha Bangaru Lokam, Marriage, Personal Life, Swetha Basu, Swetha Basu Prasad, Telugu Movie News

కొత్త బంగారు లోకం చిత్రంతో ఎక్కడా.అంటూ యూత్‌ను ఆకట్టుకున్న బ్యూటీ శ్వేతా బసు గురించి అందరికీ తెలిసిందే.

TeluguStop.com - Swetha Basu Prasad Wants To Love Again

అమ్మడు తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న ఈ అమ్మడు కొన్ని కారణాల వల్ల తన కెరీర్‌ను మధ్యలోనే ఆపేసిన విషయం తెలిసిందే.ఆ తరువాత బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ మిట్టల్‌ను వివాహం చేసుకుంది.

కాగా వివాహం జరిగిన ఏడాదికే ఆ పెళ్లి కాస్త పెటాకులు అయ్యింది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై ఆమె స్పందించింది.

ప్రేమ అనేది ఎప్పుడు, ఎందుకు పుడుతుందో తెలియదు.దానికి వయసుతో సంబంధం లేకుండా రెండు మనసులకు సంబంధించి ఉంటుంది.

ప్రేమ పుట్టనంతవరకు అంతా బాగానే ఉంటుంది, ఒక్కసారి ప్రేమలో పడితేనే అసలైన కష్టాలు మొదలవుతాయంటూ చెప్పుకొచ్చింది.తన భర్తతో విడాకులు తీసుకున్న శ్వేత, భవిష్యత్తులో తనకు మళ్లీ ప్రేమించే అవకాశం లభిస్తుందో లేదో తెలియదని అంది.

ప్రసుతం తన ఫోకస్ మొత్తం తన కెరీర్‌పైనే ఉందని, తన భర్తకు విడాకులు ఇచ్చినా ఆయనతో మంచి స్నేహం కంటిన్యూ చేస్తానంటూ చెప్పుకొచ్చింది.మరి ఈ అమ్మడు కోరుకున్నట్లుగా తన కెరీర్‌ ఇకనైనా సాఫీగా సాగుతుందా లేదా అనేది చూడాలి.

ఏదేమైనా పెళ్లి పెటాకులయ్యాక ఇలాంటి నీతులు చెప్పడం సెలబ్రిటీలకు వెన్నెతో పెట్టిన విద్య అంటున్నారు సాధారణ జనం.

#Swetha Basu #Personal Life #Marriage #KothaBangaru

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు