మళ్ళీ స్లిమ్ అయిన శ్వేతా బసూ…. అందుకేనా  

Swetha Basu Prasad Become A Slim For The Movie Offers - Telugu Swetha Basu Prasad, Swetha Basu Prasad Photo News, Swetha Basu Prasad Photos Goes Viral, Swetha Basu Prasad Slim Photos, Tollywood Actress Swetha Basu Prasad

టాలీవుడ్ లో ప్రముఖ సినీ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించినటువంటి “కొత్త బంగారు లోకం” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి తన నటనతో కుర్రకారు మనసులను దోచుకున్న ముద్దుగుమ్మ శ్వేతా బసు ప్రసాద్.ఈ అమ్మడు వచ్చీరావడంతోనే మంచి సాలిడ్ హిట్ అందుకుంది.

 Swetha Basu Prasad Become A Slim For The Movie Offers

అయితే ఆ తరువాత రైడ్, కళావర్ కింగ్, కాస్కో, వంటి చిత్రాలతో పర్వాలేదనిపించింది.కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం పాటు ఉన్నట్లుండి సినీ పరిశ్రమకు దూరం అయిపోయింది.

అయినప్పటికీ తన అభిమానులకి మాత్రం తన సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉంటోంది.

మళ్ళీ స్లిమ్ అయిన శ్వేతా బసూ…. అందుకేనా-Latest News-Telugu Tollywood Photo Image

అయితే తాజాగా ఈ అమ్మడు తనకు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకుంది.

ఈ ఫోటోలను చూసినటువంటి నెటిజన్లు ఒక్కసారిగా ఆమె అందానికి ఫిదా అయ్యారు.అంతేకాక ఉన్నట్లుండి సినీ పరిశ్రమకు దూరం అవడంతో బాగా బరువు పెరిగి బొద్దుగుమ్మ లా తయారైంది.

అయితే ఈ మధ్య కాలంలో తన బరువును తగ్గించడం కోసం జిమ్ మరియు వర్కౌట్లు బాగా చేస్తూ స్లిమ్ గా తయారయింది.దీంతో మళ్లీ టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

అయితే శ్వేతా బసు ప్రసాద్ అవగాహన లేమి కారణంగా పెళ్లయిన కొంతకాలానికే తన భర్త నుంచి విడాకులు తీసుకుంది.దీంతో సినిమాల పరంగా తప్పటడుగులు వేస్తే కేవలం సినీ కెరియర్ మాత్రమే పోతుందని, కానీ జీవితంలో తప్పటడుగులు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మొత్తం జీవితమే నాశనం అవుతుందని పలువురు సన్నిహితులు శ్వేతా బసు ప్రసాద్ కి సూచిస్తున్నారు.దీంతో ఈ అమ్మడు కూడా గతంలో జరిగినటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు