లడ్డూ కావాలా నాయనా! అయితే ఎలక్షన్ రిజల్ట్ వరకు వెయిట్ చేయండి  

ఎన్నికల ఫలితాలు నేపధ్యంలో డిమాండ్ పెరిగిన స్వీట్స్. .

Sweets Huge Demand In Election Mood-congress,election Mood,sweets Huge Demand,tdp,ysrcp

ఎలక్షన్ కౌంటింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇక దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల ఫలితాలపై చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఎన్నికలలో కేంద్రంలో బీజేపీ పార్టీ, ఏపీలో వైసీపీ పార్టీ చాలా నమ్మకంగా ఉన్నాయి..

లడ్డూ కావాలా నాయనా! అయితే ఎలక్షన్ రిజల్ట్ వరకు వెయిట్ చేయండి-Sweets Huge Demand In Election Mood

మరో వైపు ఇతర రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు కూడా గెలుపుపై ధీమాగా ఉన్నాయి. ఇక ఎన్నికలు ఫలితాలు వెలువడుతున్న నేపధ్యంలో స్వీట్ షాప్ లకి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా లడ్డూలకి మంచి గిరాకీ వచ్చింది.

ప్రాంతీయ పార్టీల నుంచి, జాతీయ పార్టీల నేతల వరకు అందరిలో ఎవరైతే గెలుపు మీద గట్టి నమ్మకంతో ఉన్నారో అందరూ లడ్డూలు కొనుగోలు చేయడానికి సిద్ధం అవుతున్నారు అని చెప్పాలి. వారంతా విజయోత్సవాల కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్వీట్లకు భారీగా ఆర్డర్లు ఇస్తున్నారు.

పంజాబ్‌లో అయితే వివిధ రాజకీయ పార్టీల నాయకులు 10 నుంచి 12 క్వింటాళ్ల లడ్డూలు ఆర్డర్ చేశారు. వీరిలో బీజేపీ, శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్‌కు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలుస్తోంది. ఇక ఏపీలో కూడా వైసేపీ పార్టీ శ్రేణులలో చాలా మంది లడ్డూలు ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తుంది.