కుక్క పిల్లలకు డిజైనర్ డ్రెస్సులు.. వీటి ధర ఏకంగా...?

ప్రస్తుతం ప్రపంచ దేశాల్లోని కొన్ని దేశాల్లో ఎండాకాలం నడుస్తోంది.ఈ ఎండకి మూగ జంతువులు అల్లాడిపోతున్నాయి.

 Sweet Mummy Wearable Designer Dresses For Puppies Details, Viral, Dogs, Designer-TeluguStop.com

పెంపుడు జంతువుల యజమానులు కూడా వాటిని బయటకి తీసుకురాలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు జపాన్‌కు చెందిన ‘స్వీట్ మమ్మీ’ అనే కంపెనీ వినూత్న ఆలోచన చేసింది.

జంతువులకు చల్లని గాలిని అందించే ఒక డ్రెస్‌ను సిద్ధం చేసింది.ఇది ఒక నైట్ డ్రెస్ అట.అందువల్ల దీనిని తొడుక్కుంటే జంతువులకు ఎలాంటి ఉక్కపోత సమస్యలు ఎదురు కావు.గాలి అన్ని పక్కలనుంచి తాకుతుంది.

విశేషమేంటంటే, ఈ చిట్టి నైట్ డ్రెస్ పైన ఒక చిన్న ఫ్యాన్ సైతం అందించారు.ఈ ఫ్యాన్ తిరుగుతూ జంతువులకు కావలసిన గాలిని అందజేస్తుంది.మాటెర్నిటీ క్లోతింగ్ కంపెనీ స్వీట్ మమ్మీ ప్రెసిడెంట్ అయిన రీ ఉజావా ఈ డ్రెస్ ని తయారు చేశారు.ఈమె కూడా తన కుక్కపిల్ల ఎండాకాలంలో చాలా ఇబ్బంది పడుతుంటే చూసి చలించిపోయారు.

తర్వాత బాగా ఆలోచించి దీనికి ఒక నైట్ డ్రెస్ యే పరిష్కారం అనుకున్నారు.దానిని తయారు చేసి ఇప్పుడు అందరి ప్రశంసలు పొందుతున్నాడు.

Telugu Cost, Dogs, Japan, Sweet Mummy-Latest News - Telugu

ఒక వల లాగా ఉండే ఈ కోట్‌కు ఒక చిన్న ఫ్యాన్‌ అమర్చామని.ఈ డ్రెస్‌ను కుక్కలతోపాటు పిల్లులకు కూడా సరిగ్గా పడుతుందని ఉజావా వెల్లడించారు.ఇందులోని ఫ్యాన్‌ బ్యాటరీ సాయంతో నడుస్తుందని వివరించారు.డైలీ 10 నిముషాలు ఛార్జ్ చేస్తే చాలు ఈ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుందన్నారు.దీని ధర 60 (సుమారు రూ.5,765) పౌండ్స్ అని కంపెనీ తెలిపింది.మరి ఇంకెందుకు ఆలస్యం.? మీకు కూడా ఒక పెంపుడు జంతువు ఉంటే ఈ డ్రెస్ కొనేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube