సాధారణంగా ఊరు పేరు అడిగితే ఎవరూ కూడా బూతులు తిట్టరు.కానీ ఒక ఊరి ప్రజలు మాత్రం బండబూతులు తిడతారు.
అదేంటని ఆశ్చర్యపోకండి.ఎందుకంటే ఆ ఊరి పేరే ఒక పెద్ద బండబూతు అట.ఇప్పుడు ఆ ఊరి పేరు గురించి తెలుసుకొని నెటిజన్లు అవాక్కవుతున్నారు.ఇంతకీ ఆ ఊరు ఎక్కడ ఉంది? దాని పేరేంటి వంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీడన్ దేశంలో ప్రకృతికి చిరునామాగా నిలిచే ఓ చిన్న గ్రామం ఉంది.ఆ గ్రామానికి “ఫకే” అని పేరు పెట్టారు.స్వీడిష్‌లో ఆ పదం అర్థం బూతు కాదు.కానీ ఇంగ్లిష్ లో మాత్రం ఈ పదానికి అర్థం పచ్చి బూతుగా వినిపిస్తుంది.
అయితే తమ స్వీడిష్ భాషలో దానికి వేరే అర్థం ఉంది కాబట్టి అక్కడి గ్రామ ప్రజలు ఎన్నడూ బాధపడలేదు.పైగా తమ ఊరి పేరుని గర్వంగా చెప్పుకునేవారు.
ఈ పేరును మార్చాలని కూడా వాళ్లు ఎప్పుడూ ఆలోచన చేయలేదు.కానీ సోషల్ మీడియాలో ఈ ఊరి పేరుతో ఉన్న పోస్టులు, ఫొటోలు, వీడియోలు అన్ని బ్లాక్ అవుతున్నాయి.
ఫకే అనేది ఒక అభ్యంతరకర, అసభ్యకర పదం అని సోషల్, మీడియా సైట్లు పేర్కొంటూ ఊరు పేరు కలిగిన పోస్టులు ఫొటోలన్నీ డిలీట్ చేసేస్తున్నాయి.దీనివల్ల వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ గ్రామంలోని ఇంటి యజమానులు ఫేస్బుక్లో తమ విలేజ్ నేమ్ రాస్తున్నారు కానీ అవి అన్ని డిలీట్ అయిపోతున్నాయి.దీనివల్ల వాళ్లు బాగా చికాకు పడుతున్నారు.
ఇప్పుడు సమస్యను పరిష్కరించడానికి, గ్రామంలో నివసించే వ్యక్తులు తమ గ్రామం పేరును “ఫక్” నుంచి “డాల్స్రో”గా మార్చడానికి ది నేషనల్ సర్వే ఆఫ్ స్వీడన్‌కు ఒక దరఖాస్తును పంపారు.డాల్స్రో అంటే “నిశ్శబ్ద లోయ”. ప్రస్తుతం స్వీడన్ అధికారులు ఆ దరఖాస్తును ప్రాసెస్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.ఊరి పేరు మార్చడం అంటే కాస్త సమయంతో కూడుకున్న పనే కాబట్టి ఇది కొద్ది నెలలపాటు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
వాస్తవానికి అసభ్యకర పదాలు గ్రామాల పేర్లగా తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగుతున్నాయి.ఇప్పటికీ కొన్ని రికార్డుల్లో “కొజ్జేపల్లి” లాంటి అసభ్యకర గ్రామాల పేర్లు కొనసాగుతూనే ఉన్నాయి.