నగ్నంగా ఉన్న క్రిమినల్ ని పట్టుకున్న న్యూడ్ పోలీస్ , అసలు విషయం ఏంటంటే...

పోలీసులు క్రిమినల్స్ ని పట్టుకోవడానికి వివిధ ప్లాన్ లతో వెళ్తారు , ప్లాన్ వర్కౌట్ అయితే క్రిమినల్ దొరికినట్లే ఒకవేళ కాకపోతే ఇంకో ప్లాన్ , క్రిమినల్ నేరం చూస్తూ దొరికితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అంటారు మరి క్రిమినల్ ని నగ్నంగా పట్టుకుంటే ఏమనాలి, అలాంటి ఒక సంఘటనే స్వీడన్ లో జరిగింది , అసలు విషయం ఇదే.

 Swedish Police Officer Arrests Fugitive In Sauna Whileboth Naked-TeluguStop.com

స్వీడన్ లో ఒక దొంగ పోలీస్ కి నగ్నంగా పట్టుబడ్డాడు.

అతన్ని పట్టుకున్న పోలీస్ కూడా నగ్నంగానే పట్టుకున్నాడు అది కూడా ఒంటి మీద అంగుళం బట్టకూడా లేకుండా ఇది ఎక్కడో రోడ్డు మీద కాదులే , స్టీమ్ బాత్ స్పా సెంటర్‌లో .ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ,స్వీడెన్‌లోని స్టాక్‌హోమ్‌ ఏరియాకు చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ డ్యూటీ ముగిసిన తర్వాత కాస్త ఉపశమనం పొందుదామని మఫ్టీలో స్టీమ్ బాత్ స్పా సెంటర్‌కు వెళ్లాడు.ఆవిరి స్నానం చేసేందుకు బట్టలన్నీ తీసేసిన తర్వాత ఎదురుగా నిల్చున్న వ్యక్తిని చూశాడు.కాస్త జాగ్రత్తగా గమనించి చూడగా అతను ఓ డ్రగ్స్ సప్లై కేసులో అరెస్ట్ అయ్యి, కస్టడీ నుంచి తప్పించుకుని తిరుగుతున్న మోస్ట్ వాంటెట్ క్రిమినల్ అని గుర్తించాడు.

వెంటనే అతన్ని పట్టుకోవాలని అనుకున్నాడు.అయితే పోలీస్ అధికారి ఒంటిపై నూలుపోగు లేదు.ఎదురుగా నిల్చున్న క్రిమినల్ కూడా నగ్నంగా ఉన్నాడు.

అరెస్ట్ చేసేందుకు ఆయుధాలు గానీ, పోలీసులకు సమాచారం ఇవ్వడానికి మొబైల్ ఫోన్ గానీ అందుబాటులో లేదు.అయితే ఆ సమయంలోనే ఏ మాత్రం కంగారు పడకుండా సమన్వయం పాటించిన పోలీసు ఆ క్రిమినల్ కి అనుమానం రాకుండా ఆ స్పా సెంటర్ లొనే కాసేపు స్నానం చేసాడు.కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి జారుకుని ఫోన్ తీసుకుని, సిబ్బందికి సమాచారం అందించారు.

అధికారి ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ డ్రగ్ సప్లై నెరస్తుడు బయటికి రాగానే అరెస్ట్ చేశారు.ఈ సంఘటనను వివరిస్తూ ఫోటో తో సహా సోషల్ మీడియాలో పెట్టాడు ఆ పోలీస్ సదరు అధికారి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube