రాజరికం పక్కన పెట్టి సేవ చేస్తున్న యువరాణి

రాజరికం పక్కన పెట్టి యువరాణి కరోనా రోగుల కు సేవ చేసే పనిలో పడ్డారు.ఎవరా యువరాణి అని అనుకుంటున్నారా స్వీడన్ దేశపు యువరాణి సోఫియా(35).

 Sweden’s Princess, Sofia Joins Stockholm Hospital,medical Professionals, Socia-TeluguStop.com

కరోనా వైరస్ ప్రభావానికి తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో స్వీడన్ ఒకటి అన్న సంగతి తెలిసిందే.ఈ మహమ్మారి బారిన పడి ఆ దేశ రాచకుటుంబానికి చెందిన ఓ మహిళ కూడా ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే.

అయితే దానిని కూడా లెక్కచేయకుండా ఈ యువరాణి స్వచ్ఛందంగా కరోనా రోగులకు తన సేవలు అందించడానికి రావడం గమనార్హం.
తాను గౌరవ చైర్ పర్సన్ గా ఉన్న స్టాక్‌ హోమ్‌లోని సోఫియా హెమ్మెట్ హాస్పిటల్ లో ఆమె హెల్త్ కేర్ అసిస్టెంట్ గా పనిచేయనున్నారు.

అందుకు ఆమె మూడు రోజుల శిక్షణ కూడా తీసుకున్నట్లు.అయితే ఆమె వృత్తిరీత్యా డాక్టర్ కాకపోవడంతో కరోనా రోగులకు చికిత్స చేయరు.కానీ, వైద్యేతర పనులలో సహాయకురాలిగా పనిచేయనున్నట్లు సమాచారం.ఫ్లోర్ క్లీనింగ్, కిచెన్‌లో డిష్ వాషింగ్, వైద్య పరికరాలను శుభ్రం చేయడం వంటి పనులు చేయనున్నారు.

Telugu Sofiajoins-

దీని గురించి హాస్పిటల్ వైద్యుడు ఒకరు మాట్లాడుతూ.ఈ క్లిష్ట పరిస్థితులను అర్థం చేసుకుని సేవ చేసేందుకు మనకు మనమే ముందుకు రావాలనే ఉద్దేశంతో ఆరోగ్య కార్యకర్తగా పనిచేసేందుకు రాకుమారి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు వెల్లడించారు.ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారడం తో నెటిజన్లు అందరూ యువ రాణి నిర్ణయానికి ఫిదా అయిపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube