భారత్ వచ్చి బిచ్చమెత్తుకుంటున్న...కోటీశ్వరుడు...!!!  

Sweden Citizen Come India And Begging - Telugu Begging Money In India, Sweden Citizen, Sweden Nri Begging Money, Telugu Nri News, Telugu Viral News

ప్రస్తుత కాలంలో ధనం లేనిదే జనం లేరు.ధనం ఉంటేనే సమాజంలో గౌరవం.

Sweden Citizen Come India And Begging - Telugu Begging Money In India, Sweden Citizen, Sweden Nri Begging Money, Telugu Nri News, Telugu Viral News-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

డబ్బుని బట్టే హోదాలు ఇస్తుంటారు చుట్టాలైనా, పట్టాలైనా.ఎవరో కవి రాసినట్టుగా డబ్బుంటే సుబ్బి గాడిని సుబ్బారావుగారు అంటారు.

ఇది నిజమే డబ్బుంటే అన్నీ వాటంతట అవే వచ్చేస్తూ ఉంటాయి.ఎక్కడ లేని స్నేహితులు బంధువర్గం, ఉభయకుశలోపరులు ఇలా అందరూ డబ్బు ఉన్న చోట చెక్కభజన చేస్తుంటారు.

ఇలాంటివన్నీ చూసి విసిగి వేసారి పోయి ,డబ్బు మీద విరక్తి కలిగి ప్రశాంతత కావాలని ఎంతో మంది అనుకుంటారు కానీ ఆ చట్రం నుంచి బయటపడలేరు అయితే

స్వీడన్ కు చెందిన ఓ బడా పారిశ్రామికవేత్త వీటన్నిటినీ కాదనుకుని ప్రశాంతత కోసం భారతి వచ్చేశాడు.

చిటికేస్తే పని చేసి పెట్టే పని వాళ్ళు, విలాసవంతమైన జీవితం ప్రపంచ నలుమూలల నుంచి ఏది కావాలని అనుకున్నా కాళ్ల ముందుకు వచ్చే పరిస్థితులు, ఇదేమి ఆ వ్యక్తిని సంతృప్తి పరచలేదట.

దాంతో లక్ష కోట్ల తన ఆస్తులని వదిలేసి మరీ కొన్ని నెలల క్రితం భారత్ లో ఉన్న యోగా కేంద్రానికి వచ్చి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు.

అక్కడ స్థానికంగా ఉండే పేద ,బడుగు బలహీన వర్గాల ప్రజలకు సాయం చేయడం ప్రారంభించాడు అయినా సరే తనకి మానసిక ప్రశాంతత దొరకలేదని సరైన మార్గాన్ని సూచించమని తన ఆధ్యాత్మిక గురువుని అడుగగా బిచ్చమెత్తుకోమని ఆ గురువు సూచించడంతో ఆ రోజు మొదలు ఆస్తి, పాస్తులన్నీ వదిలేసుకుని కోయంబత్తూర్ వీధుల్లో అడుక్కుంటున్నాడు.

ఒంటికి వేసుకునే దుస్తుల పైన కూడా వ్యామోహం లేదని అర్దనగ్నంగా వీధుల్లో అడుక్కుంటున్నాడు.రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఐదు, పది రూపాయలు తీసుకుంటున్నాడు.

అతని గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ఇదేమి విడ్డూరం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఒక బడా పారిశ్రామిక వేత్త భారత్ వచ్చి అడుక్కోవడం ఏమిటి అంటూ నోళ్ళు వెళ్ళబెడుతున్నారు ప్రజలు.

తాజా వార్తలు

Sweden Citizen Come India And Begging-sweden Citizen,sweden Nri Begging Money,telugu Nri News,telugu Viral News Related....