ముంబై వీధుల్లో ఫుట్ పాత్ పైన జీవించిన స్వయంకృషి సంగీత దర్శకుడు..!

ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరో హీరోయిన్ తో పాటు ఆ సినిమా కథ కూడా బాగుండాలి దర్శకుడి దర్శకత్వ ప్రతిభ కూడా బాగుండాలి లేకపోతే సినిమా అనేది ఆడదు వీటితోపాటు సినిమాకు సంబంధించిన మ్యూజిక్ కూడా బాగుండాలి.ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ల వాళ్ల ప్రతిభతో బాగా లేని మూవీ ని సైతం వాళ్ళ మ్యూజిక్ తో రక్తి కట్టించారు.

 Swayamkrushi Music Director Ramesh Naidu Last Days,swayamkrushi Music Director R-TeluguStop.com

ఎన్ని క్రాఫ్ట్ లు ఉన్నా మ్యూజిక్ అనేది లేకపోతే సినిమాని మనం చూడలేము ఎంజాయ్ చేయలేము.అలాంటి సినిమాకి మ్యూజిక్ అందించే మ్యూజిక్ డైరెక్టర్లు చాలామంది ఉన్నప్పటికీ ఒక్కొక్కరిదీ ఒక్కొక్క స్టైల్ గా ఉంటుంది.

అందులో రమేష్ నాయుడు గారి మ్యూజిక్ ఒకలా ఉంటుంది అందరిలా కాకుండా వైవిధ్యాన్ని ఇష్టపడే రమేష్ నాయుడు గారు ఆయన ఇచ్చే మ్యూజిక్ లో కూడా చాలా వైవిధ్యమైన ట్యూన్స్ ఉంటాయి.

Telugu Music Ramesh, Ramesh, Svayam Krushi, Swayamkrushi-Telugu Stop Exclusive T

దాసరి నారాయణ రావు గారు తెరకెక్కించిన మేఘసందేశం సినిమాలో ఆయన స్వరపరిచిన బాణీలు బాలమురళీకృష్ణ గారినీ సైతం అబ్బురపరిచాయి అంటే ఆయన ఎంత గొప్ప సంగీత దర్శకుడో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .అలాంటి రమేష్ నాయుడు గారు తెలుగులో చాలా సినిమాలు చేశారు.మేఘసందేశం తాతా-మనవడు లాంటి ఎన్నో గొప్ప గొప్ప హిట్ సినిమాలకి ఆయన మ్యూజిక్ ని అందించారు.

ఆయన మ్యూజిక్ లో ప్రధానంగా చెప్పాల్సింది మెలోడీ సాంగ్స్ గురించి ఆయన అప్పట్లో అద్భుతమైన మెలోడీ సాంగ్స్ ఇచ్చేవారు.కళాతపస్వి కె విశ్వనాథ్ గారు చిరంజీవి తో తెరకెక్కించిన సినిమా స్వయంకృషి ఇందులో చిరంజీవి విజయశాంతి హీరో హీరోయిన్లుగా చేయగా చరణ్ రాజ్ ఒక మంచి క్యారెక్టర్ చేశాడు అయితే ఈ సినిమా లో చిరంజీవి చెప్పులు కుట్టుకునే ఒక సాధారణ మనిషి గా కనిపిస్తాడు.

ఈ సినిమా విజయంలో దర్శకుడి ప్రతిభ ఎంత ఉంటుందో యాక్టర్ గా చిరంజీవి ప్రతిభ ఎంత ఉంటుందో ఎంత ఉంటుందో ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా తన పాత్ర కూడా అంతే ఉంది అని చెప్పొచ్చు.

Telugu Music Ramesh, Ramesh, Svayam Krushi, Swayamkrushi-Telugu Stop Exclusive T

ముఖ్యంగా స్వయంకృషి సినిమాలో చిరంజీవి అడవిలో తన బాబు ని వెనకాల కట్టుకొని నడుచుకుంటూ వెళుతూ పాడే పాట పారా హుషార్ పారాహుషార్ తూర్పు అమ్మ దక్షిణ అమ్మ అంటూ సాగే పాట మాత్రం అప్పట్లో ఒక ప్రభంజనం సృష్టించిందనే చెప్పొచ్చు ఆ పాటలో వచ్చే మ్యూజిక్ ఒక ఎత్తయితే ఆ పాటలో రాసిన లిరిక్స్ ఇంకో ఎత్తు.అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ప్రస్తుత కాలంలో మనకు దొరకడం చాలా కష్టం ఇప్పుడు వచ్చే మ్యూజిక్ లో ఎంతసేపు డ్రమ్స్ సౌండ్ తప్ప లిరిక్స్ ఏం అర్థం కాకుండా ఉన్నాయి అప్పట్లో రమేష్ నాయుడు ఇళయరాజా గారు ఇలాంటి గొప్ప వ్యక్తులు చేసిన మ్యూజిక్ లో ప్రతి లిరిక్ మనకందరికీ అర్థమైనట్టుగా ఉండేది కానీ ఇప్పుడు ఏంటో పాట అర్థం కావట్లేదు మ్యూజిక్ అర్థం కావట్లేదు.ఇప్పుడున్న పరిస్థితుల్లో రమేష్ నాయుడు గారి లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎంతైనా ఇండస్ట్రీకి అవసరం ఉంది అయితే రమేష్ నాయుడు గారు స్వయంకృషి సినిమా అయిపోయిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అయిన రోజే అర్ధాంతరంగా చనిపోయారు.

కానీ అయన చనిపోయే నాటికి పరిస్థితులు మారిపోయాయి.రమేష్ నాయుడు చివరి రోజులు చాలా గడ్డుగా సాగాయని అప్పటి ఇండస్ట్రీ పెద్దలు చెప్పుకుంటారు.నిజానికి అయన తన కొన్నాళ్ల జీవితం ముంబై ఫ్లాట్ ఫార్మ్స్ పై కూడా గడిపారట.అయన చనిపోయిన విధానం కూడా చాల దుర్భరంగా ఉందట.

ఏది ఏమైనా ఇప్పటికీ ఆయన ఇచ్చిన మ్యూజిక్ మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా ఉంది అట్లాంటి నాణ్యమైన మ్యూజిక్ ఇచ్చే చాలా తక్కువ మంది మ్యూజిక్ డైరెక్టర్లలో రమేష్ నాయుడు గారు ఒకరు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube