సీక్రెట్‌ ప్లేస్‌లో ఆ టాటూ వేయించుకుంటా... మా ఆయన మాత్రమే దాన్ని చూడాలంటోంది

తెలుగమ్మాయి స్వాతి బుల్లి తెరపై కలర్స్‌ అనే కార్యక్రమంతో మంచి ఫేమస్‌ అయ్యింది.అప్పట్లో స్టార్స్‌తో ఇంటర్వ్యూలు చేయడం వల్ల ఈమె మంచి గుర్తింపు దక్కించుకుని సినిమాల్లో కూడా ఛాన్స్‌ దక్కించుకుంది.

 Swathi Reddy Wants Tattoo On Her Private Part For Her Husband Telugu-TeluguStop.com

హీరోయిన్‌గా ఎన్నో చిత్రాల్లో నటించినా కూడా ఈమెకు తెలుగులో మాత్రం స్టార్‌ డం దక్కలేదు.మలయాళం మరియు తమిళంలో మాత్రం ఈమెకు హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకుంది.

తెలుగులో హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించిన ఈమె ఇక లాభం లేదని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగు పెట్టింది.

ఇంటర్నేషనల్‌ పైలెట్‌ అయిన వికాస్‌ను పెళ్లి చేసుకుని ఇండోనేషియాలో జీవితాన్ని గడిపేస్తున్న ఈ అమ్మడు తాజాగా టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.స్వాతి మిడిల్‌ ఫింగర్‌కు చిన్న టాటూ ఉంటుంది.

ఆ టాటూ గురించి మాట్లాడుతూ.తనను ఎవరైనా కామెంట్‌ చేసినా, తనతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా కూడా ఆ ఫింగర్‌ చూపిస్తాను అంటూ చెప్పుకొచ్చింది.మీకు టాటూలు అంటే ఇష్టమేనా, ఇంకా ఏమైనా టాటూలు వేయించుకుంటారా అంటూ ప్రశ్నించిన సమయంలో పెద్దగా టాటూలు ఇష్టం లేదు.

ఏదైనా టాటూ వేయించుకోవాల్సి వస్తే మాత్రం నేను నా భర్తకు మాత్రమే కనిపించే నా ప్రైవేట్‌ పార్ట్‌లో వి అనే అక్షరంను టాటూగా వేయించుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది.ఆ టాటూ మరెవ్వరు కూడా చూడకుండా సీక్రెట్‌ ప్లేస్‌లో వేయించుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది.

తన భర్త పేరులోని మొదటి అక్షరం అయిన వి ని ఆమె వేయించుకునేందుకు ఆసక్తి చూపుతుందట.ఆ మాటలోనే తెలుస్తుంది ప్రస్తుతం స్వాతి భర్తతో ఎంత క్లోజ్‌గా ఉంటుందో.

వారి సంసార జీవితం ఎప్పుడు హాయిగా ఉండాలని కోరుకుందాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube