తల్లి కాబోతున్న తెలుగు శృంగార నటి... అయినా ఆ వీడియోలు ఆపనంటూ

తెలుగులో తన హాట్ హాట్ వీడియోలతో కుర్రకారు గుండెల్లో హీట్ పెంచినటువంటి యాంకర్ మరియు నటి స్వాతి నాయుడు గురించి తెలియని వారుండరు.అయితే ఈమె సినిమా పరిశ్రమకి మంచి నటి అవ్వాలని వచ్చినప్పటికీ అనుకోని కారణాలవల్ల బి గ్రేడ్ మరియు శృంగార తరహా చిత్రాల్లో నటించాల్సి వచ్చిందని ఇప్పటికే పలు సందర్భాల్లో స్వాతి నాయుడు చెప్పుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

 Swathi Naidu, Telugu Actress, Swathi Naidu Pregnancy News, Movie Offers, Tollywo-TeluguStop.com

అయితే గత కొద్దికాలంగా స్వాతి నాయుడు సోషల్ మీడియాకి దూరంగా ఉంటోంది.తాజాగా స్వాతి నాయుడు తల్లి కాబోతున్నట్లు ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో తెలిపింది.

అంతేగాక తన భర్తని ప్రేమించి పెళ్లి చేసుకునాన్నని ప్రస్తుతం ఇద్దరు బాగానే సంతోషంగా ఉన్నామని కూడా తెలిపింది.అంతేగాక అర్థం చేసుకునే భర్త ఉంటే ఏ ఆడపిల్లయినా సంతోషంగా ఉంటుందని చెప్పుకొచ్చింది.

 గతంలో అవకాశాల కోసం చాలా కష్టపడ్డానని, తన కుటుంబ పోషణ నిమిత్తం బి గ్రేడ్ తరహా చిత్రాల్లో మరియు షార్ట్ ఫిలిమ్స్ లో నటించక తప్పలేదని కూడా తెలిపింది.తాను బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత కూడా వీడియోలు, సినిమాలు చేస్తానంటూ ఏదైనా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనేదే తన ఆశయమని తెలిపింది.

అలాగే సినీ పరిశ్రమకు ఎంతో మంది యువత అవకాశాలు దక్కించుకొని పేరు, ప్రఖ్యాతలు సంపాదించాలని వస్తారని కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే అది కొంత మందికి మాత్రమే సాధ్యమవుతుందని, మరికొంతమంది మాత్రం అవకాశాల కోసం అడ్డదారుల్లో ప్రయత్నిస్తూ జీవితాలను పాడు చేసుకుంటున్నారని వాపోయింది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube