స్వాతినాయుడును పెళ్లి చేసుకున్న అవినాష్‌ ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా?  

Swathi Naidu Husband Avinash About His Marriage-swathi Husband,swathi Naidu,swathi Naidu Marriage

  • యూట్యూబ్‌ సెన్షేషన్‌ శృంగార తార స్వాతి నాయుడు కొన్ని రోజుల క్రితం అవినాష్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. విజయవాడలో వీరి వివాహం వైభవంగా జరిగింది. పెళ్లి స్వాతినాయుడు కుటుంబ సభ్యులు మరియు బంధువుల మద్య మాత్రమే జరిగింది. అవినాష్‌ కు సంబంధించిన వారు ఎవరు కూడా ఈ పెళ్లిలో పాల్గొనలేదు. పెళ్లికి వారు మొదటి నుండి నో చెబుతూ వచ్చారు. స్వాతి నాయుడును పెళ్లి చేసుకోవద్దని అవినాష్‌ను హెచ్చరించారట. తమ పెళ్లికి ఒప్పుకోవాల్సిందిగా అవినాష్‌ వాళ్ల ఇంటికి స్వాతి కూడా వెళ్లి పలుమార్లు కోరిందట. కాని వారు మాత్రం నో అంటూ చెప్పారట.

  • స్వాతి నాయుడు తండ్రి మాత్రం వీరి పెళ్లికి ఓకే చెప్పాడు. ఆయన కూడా అవినాష్‌ కుటుంబ సభ్యులను ఒప్పించడానికి వెళ్లగా ఆయన్ను తీవ్ర పదజాలంతో దూషించారట. నీ కూతురు ఎలాంటిదో నీకు తెలియదా, అలాంటి కూతురుకు మా కొడుకును ఎలా ఇస్తామంటూ ఛీ కొట్టి పంపించారట. కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా కూడా వినకుండా అవినాష్‌ ఈ పెళ్లికి సిద్దం అయ్యాడట. పెళ్లి రెండు రోజులు ఉండగా కూడా అవినాష్‌ను అతడి సోదరుడు ఫోన్‌ చేసి బెదిరించి పోలీసు కేసు పెట్టేందుకు ప్రయత్నించాడట. అయినా కూడా అవినాష్‌ ఏమాత్రం భయపడకుండా, తాను ప్రేమించిన స్వాతి నాయుడును పెళ్లి చేసుకున్నాడు.

  • Swathi Naidu Husband Avinash About His Marriage-Swathi Swathi Marriage

    Swathi Naidu Husband Avinash About His Marriage

  • స్వాతిని పెళ్లి చేసుకుంటాను అంటూ మొండికేసిన నేపథ్యంలో అవినాష్‌ తల్లిదండ్రులు అతడిని వదిలేశారట. ఇకపై నువ్వు మాకు పుట్టలేదని భావిస్తాం, మా గురించి, మాకు సంబంధించిన విషయాల్లో కాని నీవు భాగస్వామ్యం అవ్వవద్దని హెచ్చరించారట. కుటుంబం మాట కాదని, వారు ఇప్పుడు కాకుంటే మరెప్పుడైనా నా మనసు అర్థం చేసుకుంటారనే ఉద్దేశ్యంతో స్వాతిని నేను పెళ్లి చేసుకున్నాను అంటూ అవినాష్‌ తాజాగా ఒక యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.