స్వాతిముత్యం టార్గెట్ గట్టిగానే ఉందే.. బిజినెస్ లెక్కలు ఇవే!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో బెల్లంకొండ సురేష్ బాబు ఒకరు.ఈయన అప్పట్లో తెలుగు బాక్సాఫీస్ దగ్గర వరుస విజయాలు సొంతం చేసుకుని స్టార్ నిర్మాతగా మారిపోయాడు.

 Swathi Muthyam Movie Business, Swathi Muthyam, Swathi Muthyam Business, Bellamko-TeluguStop.com

ఇక ఇప్పుడు ఈయన పూర్తి స్థాయిలో సినిమాలు నిర్మించడం లేదు.కానీ ఈయన కొడుకులను హీరోలుగా నిలబెట్టాలని తాపత్రయ పడుతున్నాడు.

అందుకే కొడుకుల వెనకాల ఉండి జాగ్రత్తగా వాళ్ళ కెరీర్ ను ప్లాన్ చేస్తూ వాళ్లకు సపోర్ట్ గా ఉంటున్నాడు.

ఇక ఇప్పటికే బెల్లంకొండ సురేష్ పెద్ద కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయం అయ్యాడు.

ఇతడు వరుస సినిమాలు చేస్తూ పర్వాలేదు అనిపిస్తున్నాడు.ప్రెజెంట్ సాయి శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు.

ఈ సినిమాను వివి వినాయక్ డైరెక్ట్ చేస్తున్నాడు.ఇక ఇప్పుడు సురేష్ బాబు తన చిన్న కొడుకును తీసుకు వస్తున్నాడు.

గత కొంత కాలంగా బెల్లంకొండ గణేష్ బాబు తెలుగులో హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు.

మొత్తానికి గణేష్ బాబు స్వాతిముత్యం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయ్యాడు.

వర్షా భోల్లమ్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించారు.ఫ్యామిలీ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాను లక్ష్మణ్ డైరెక్ట్ చేసాడు.

ఇక ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కాబోతుంది.అదే రోజు చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో, నాగార్జున ది ఘోస్ట్ సినిమాతో రాబోతున్నారు.

Telugu Bellamkondasai, Swathi Muthyam, Varsha Bholamma-Movie

అయినా కూడా స్వాతిముత్యం పెద్ద హీరోలతో పోటీ పడడానికి వెనకడుగు వేయడం లేదు.ఇక ఈ సినిమా రైట్స్ 3.7 కోట్లకు అమ్ముడు పోయినట్టు తెలుస్తుంది.మరి ఈ సినిమా సక్సెస్ కావాలంటే 4 కోట్లు రాబట్టాల్సిందే.

మరి ఈ సినిమాపై పెద్ద అంచనాలు అయితే లేవు కానీ.పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టడం ఖాయం.

చూడాలి చిన్న టార్గెట్ అయినా ఈ సినిమా ఎన్ని రోజులకు టార్గెట్ ఫినిష్ చేస్తుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube