ఈ ఫోటోలోని బిగ్ బాస్ కంటెస్టెంట్ ను గుర్తు పట్టారా..?

బుల్లితెరపై టీఆర్పీ రేటింగులతో అదరగొడుతున్న బిగ్ బాస్ షో రోజురోజుకు ప్రేక్షకులను ఆకర్షించడంలో సక్సెస్ అవుతోంది.ప్రోమోలతో బిగ్ బాస్ నిర్వాహకులు షోపై ఆసక్తిని పెంచుతున్నారు.

 Swathi Deekshith Childhood Photo Goes Viral In Social Media , Big Boss, Telugu,-TeluguStop.com

మొదట్లో బిగ్ బాస్ కంటెస్టెంట్లపై ముక్కూమొహం తెలియని కంటెస్టెంట్లు అనే విమర్శలు వచ్చినా ఏ మాత్రం పరిచయం లేని వాళ్లే హైలెట్ అవుతూ షోపై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలలో కుమార్ సాయి వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయినా అవినాష్, స్వాతి దీక్షిత్ ఎంట్రీలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

గ్లామర్ డాల్ లా కనిపిస్తూ బిగ్ బాస్ బుట్టబొమ్మగా పేరు తెచ్చుకున్న స్వాతి దీక్షిత్ చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో స్వాతి అభిమానులు ఈ ఫోటోను .వైరల్ చేస్తూ స్వాతికి అనుకూలంగా ఓట్లు వేయమని కోరుతున్నారు.మొదటి మూడు వారాలు బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ గురించి ఎక్కువ చర్చ జరగగా స్వాతి వచ్చాక ఆమె గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది.

అప్పటికే మూడు వారాలు బిగ్ బాస్ షోను చూసి ఉండటంతో స్వాతి తెలివిగా గేమ్ ఆడుతోందనే కామెంట్లు సైతం వ్యక్తమవుతున్నాయి.దశాబ్దం నుంచే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ సరైన హిట్లు లేకపోవడంతో స్వాతి దీక్షిత్ కు పెద్దగా గుర్తింపు రాలేదు.

తెలుగులో ఈమె నటించిన సినిమాలన్నీ డిజాస్టర్లు అయ్యాయి.గ్లామరస్ బ్యూటీగా గుర్తింపు ఉన్నా ఈమెకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు.

బిగ్ బాస్ షో ద్వారా ఈమె ఇమేజ్ పెరుగుతుందో లేదో చూడాలి.

మరోవైపు హౌస్ లోని కంటెస్టెంట్లు సైతం వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి స్వాతిని కొన్ని విషయాల్లో టార్గెట్ చేస్తున్నారు.

స్వాతి ప్రతివారం నామినేట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.మరి స్వాతి హౌస్ మేట్స్ లోని నెగిటివిటీని తట్టుకుని ఎంతకాలం హౌస్ లో ఉంటుందో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube