తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 నుండి ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఒకే మాట మాట్లాడుతున్నారు.ప్రేక్షకుల ఓట్ల ప్రకారం కాకుండా మమ్ములను బిగ్ బాస్ కావాలని ఎలిమినేట్ చేశారు అంటూ ఆరోపిస్తున్నారు.
బిగ్ బాస్ లో మేము చేసింది మొత్తం చూపించకుండా కేవలం వారికి కావాల్సిన చూపించి ప్రేక్షకుల వద్ద మమ్ములని బ్యాడ్ చేశారంట కూడా ఆరోపిస్తున్నారు.నిన్న సుజాత ఎలిమినేట్ అవ్వగా అంతకు ముందు స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
ఆమె ఎలిమినేషన్ అయిన తర్వాత ఇప్పటి వరకు 10 నుండి 12 మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటుంది.అన్నింటిలో కూడా తనను అన్యాయంగా ఎలిమినేట్ చేశారంటూ ఆరోపించింది.
తాను ఎంతో ఆట ఆడాలని కానీ ప్రేక్షకులకు దాని చూపించకుండా బిగ్ బాస్ టీం ఏదో కుట్ర అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్లకు ఖచ్చితంగా ఒక వారం ఇమ్యూనిటీ ఉంటుందని ఇతర భాషల్లో ప్రసారం అయ్యే అన్ని బిగ్ బాస్ ల్లో కూడా ఉంటుంది.
ఆ విషయంలో తనకు అన్యాయం జరిగిందని స్వాతి పేర్కొంది.నిర్వాహకులు మామూలుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్లకు ఇమ్యూనిటీ ఒక్క వారమైన ఇస్తారు కానీ తనకు మాత్రం అవకాశం దక్కలేదు.
వెళ్లిన వెంటనే ఎలిమినేషన్ లోకి నెట్టేశారు.దాంతో నేను గేమ్ విషయంలో అన్యాయానికి గురయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేసింది.పైగా తనకు ఓట్లు వచ్చినా కూడా బయటకు పంపించారు అనే అనుమానం వ్యక్తం చేసింది.తన కంటే తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు ఉన్నా కూడా ఎందుకు తనని ఎలిమినేట్ చేశారంటూ ప్రశ్నిస్తోంది.
బిగ్ బాస్ ఈ విషయంలో చాలా పెద్ద పొరపాటు చేశానని మొదటి వారంలో తనకు ఇమ్యూనిటీ ఇచ్చి ఉంటే ఆట మరో విధంగా ఉండేది అంటూ స్వాతి దీక్షిత్ తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది.నిన్న బయటికి వెళ్ళిన సుజాత కూడా సోషల్ మీడియాలో ఇదే విధంగా ప్రచారం చేసే అవకాశం ఉంది ఆమె ఇంటర్వ్యూలు రేపటి నుంచి మీడియాలో వస్తాయేమో చూడాలి.