ఈ సీరియల్ హీరోయిన్ సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది.. కానీ....

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈ టీవీలో ప్రసారం అవుతున్న “స్వాతి చినుకులు” అనే ధారావాహికలో మెయిన్ లీడ్ పాత్ర అయిన నీల పాత్రలో నటించి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో  అలరించిన కన్నడ సీరియల్ హీరోయిన్ రచిత మహాలక్ష్మి గురించి ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు స్వాతి చినుకులు ధారావాహికలో దాదాపుగా 1000 కి పైగా ఎపిసోడ్లలో నటించింది.

 Swathi Chinukulu Serial Fame Rachitha Mahalakshmi Real Life And Movie Offers New-TeluguStop.com

  అలాగే ప్రస్తుతం తమిళ, కన్నడ తదితర భాషలలో పలు ధారావాహికలలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది.

అయితే రచిత మహాలక్ష్మి కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో పుట్టి పెరిగింది.

ఈ అమ్మడికి చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలని చాలా ఆసక్తిగా ఉండేది. దీంతో మొదటగా 2011వ సంవత్సరంలో తమిళంలో “పిరివోయిం సంతిప్పొం” అనే ధారావాహికలో నటించి తన సీరియల్ ప్రస్థానాన్ని మొదలు పెట్టింది.

ఆ తర్వాత తెలిసిన వారి ద్వారా తెలుగులో స్వాతి చినుకులు ధారావాహికలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.ఇక అప్పటి నుంచి ఈ అమ్మడు సీరియళ్లలో నటించే అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణిస్తోంది.

అయితే  రచిత మహాలక్ష్మి కేవలం బుల్లితెర ప్రేక్షకులను మాత్రమే కాకుండా వెండితెర ప్రేక్షకులను కూడా అలరించింది.ఇందులో భాగంగా పారిజాత (కన్నడ) మరియు ఉప్పు కరువాడ  (తమిళ్)  తదితర చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.

అయితే ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాలు సాధించక పోయినప్పటికీ ఈ అమ్మడి నటనకు సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి.

అయితే ప్రస్తుతం రచిత మహాలక్ష్మి తెలుగులోప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న “చిట్టి తల్లి” అనే ధారావాహికలో నటిస్తోంది.

అలాగే తమిళంలో స్టార్ విజయ్ ఛానల్ లో ప్రసారం అవుతున్న మరో ప్రముఖ ధారావాహికలో కూడా కీలక పాత్రలో నటిస్తోంది.అయితే చక్కని ముఖ కవళికలు, చీరకట్టు సాంప్రదాయబద్ధంగా కనిపించే రచిత మహాలక్ష్మి నటన, అందం, అభినయానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube