జగన్ ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చిన స్వరూపానందేంద్ర సరస్వతి..!!

విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అంటే ఏపీ సీఎం వైఎస్ జగన్ కి ఎనలేని భక్తి భావన అని అందరికీ తెలుసు.చాలా సందర్భాలలో సీఎం జగన్ విశాఖ శారదా పీఠాన్ని దర్శించుకోవడం జరిగింది.

 Swarupanandendra Saraswati Gives Unexpected Shock To Jagan Government-TeluguStop.com

ఇద్దరి మధ్య మంచి ఆత్మీయ వాతావరణం ఉన్న తరుణంలో తాజాగా స్వరూపానందేంద్ర సరస్వతి జగన్ ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చారు.విషయంలోకి వెళితే బ్రాహ్మణ కార్పోరేషన్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇటీవల ఓ కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది.

దేవదాయ శాఖ పరిధిలో ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్ నీ.బీసీ సంక్షేమ శాఖకు ప్రభుత్వం బదిలీ చేయడం జరిగింది.దీంతో ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై బ్రాహ్మణ సంఘాలు అదేరీతిలో ప్రముఖుల నుండి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

 Swarupanandendra Saraswati Gives Unexpected Shock To Jagan Government-జగన్ ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చిన స్వరూపానందేంద్ర సరస్వతి..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇటువంటి తరుణంలో విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కూడా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైనది కాదని.

విశాఖ శారదా పీఠం నుండి ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది.ఆ ప్రకటన ఈ విధంగా ఉంది…”బ్రాహ్మణ కార్పొరేషన్ ను వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో కలపాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని పేర్కొన్నారు.

ఈ విషయంపై మంత్రి కార్యాలయం తో సంప్రదింపులు జరుపుతున్నట్లు శారదా పీఠం తెలిపింది. అగ్రవర్ణాలనన్నింటిని ఈ బిసి జాబితాలో చేర్చాలని శారదా పీఠం ప్రతిపాదిస్తూ ఉందని పేర్కొంది.

దీనిపై త్వరలోనే సానుకూల నిర్ణయం ప్రభుత్వం నుండి ఉందని ఆశిస్తున్నామని, బ్రాహ్మణులను బీసీ జాబితాలో కి కలపాలని చూస్తే విశాఖ శారదా పీఠం పోరాటం చేస్తుందని హెచ్చరించింది.

#YS Jagan #BC #Brahmin #Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు