తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పని చేయాలంటూ స్వామీజీ పిలుపు

దేశ వ్యాప్తంగా హిందువులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న అయోద్య రామ మందిర నిర్మాణంకు రేపు ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేయబోతున్న విషయం తెల్సిందే.కరోనా కారణంగా తక్కువ మంది గెస్ట్‌లను మాత్రమే నిర్వాహకులు ఆహ్వానించారు.

 Swaroopanandendra Saraswati, Swaroopanandendra Saraswati Swamy On Ayodhya, Ayodh-TeluguStop.com

దేశ వ్యాప్తంగా ఉన్న మఠాల అధిపతులను మరియు ముఖ్యమైన స్యామీజీలను అయోద్య భూమి పూజకు ఆహ్వానించారు.ఆ క్రమంలోనే ప్రముఖ విశాఖ శారద పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర  స్వామికి కూడా ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది.

అయితే ఆయన ప్రస్తుతం చతుర్మాస దీక్ష చేస్తున్న కారణంగా భూమి పూజకు వెళ్లడం లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.అయితే ఈ సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రజకు ఆయన ఒక పిలుపునిచ్చారు.
రేపు భూమి పూజ జరుగుతున్న సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని చిన్నా పెద్దా దేవాలయ్యాల్లో భక్తులు మరియు స్వామీజీలు అంతా కూడా గంట మ్రోగించాలంటూ పేర్కొన్నారు.తెలుగు రాష్ట్రాల్లో మోగే ఆ గంటల శబ్దం అయోద్య రామ మందిర భూమి పూజకు మంగళ వాయిద్యాలు అవ్వాలంటూ స్వరూపానందేంద్ర స్వామీజీ అన్నారు.

ప్రతి ఒక్కరి ఆకాంక్ష నెరవేరుతున్న ఈ సమయంలో సంయమనంతో ఉండటంతో పాటు ప్రతి గుడిలో గంటలు మ్రోగిస్తు ఆలయ నిర్మాణంకు అంతా సజావుగా సాగాలంటూ వేడుకోవాలని భక్తులను స్వామీజీ ఆదేశించారు.ప్రస్తుతం తాను రిషీకేష్‌లో చతుర్మాస దీక్ష చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.

స్వామీజీ పిలుపు మేరకు రేపు పలు దేవాలయాల్లో భూమి పూజ సమయంలో గంటలు మ్రోగించాలని భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube