కరుణించు స్వామి ! ఆ ఫలితాలతో పెరిగిన పొలిటికల్ డిమాండ్

ఒక వైపు తెలంగాణ సీఎం, మరోవైపు ఏపీ సీఎం ! ఈ ఇద్దరూ ముఖ్యమంత్రులు అయ్యారంటే కారణం ఆ స్వామీజీనే.ఆ స్వామిజి ఆశీస్సులు ఉంటే చాలు రాజకీయ దశ మారుతుంది అనే నమ్మకం ఇప్పుడు ఎక్కువైయిపోయింది.

 Swaroopananda Swamy Key Role In Ap And Telangana Assembly Elections-TeluguStop.com

ఇంతకీ ఆ స్వామి ఎవరో కాదు విశాఖపట్నం శారదాపీఠం పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి.తెలంగాణ, ఏపీ ఎన్నికల ముందు కేసీఆర్, జగన్ లకు ఆయన యాగం చేయడం ఆ ఫలితంగానే వారి రాజకీయ దశ మారి అధికారం దక్కిందనే నమ్మకం ఇప్పుడు తాజా ఎమ్యెల్యేల్లో పెరిగిపోవడంతో ఆయన చుట్టూ తిరుగుతూ తమ రాజకీయ యోగం మరింత మెరుగుపరుచుకునేందుకు తంటాలు పడుతున్నారు.

ఏపీ రాజ‌కీయాల్లో స్వ‌రూపానందేంద్ర నిత్యం చ‌ర్చ‌ల్లో ఉంటున్నారు.టీడీపీ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు ఆయ‌న ఆ ప్ర‌భుత్వ విధానాల‌ను బహిరంగంగా విమ‌ర్శించారు.ఆల‌యాల కూల్చివేత‌, టీటీడీ వ్య‌వ‌హారాల్లో టీడీపీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించిన ఆయ‌న మొద‌టి నుంచీ వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల‌ని బ‌లంగా కోరుకున్నారు.ఈ మేర‌కు జ‌గ‌న్ ను ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం రుషీకేష్ తీసుకెళ్లి ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు.

జ‌గ‌న్ ను అధికారానికి చేరువ చేసిన పాద‌యాత్ర‌కు కూడా ఆయనే ముహూర్తం పెట్టారు.జ‌గ‌న్ కు కూడా ఆయ‌నంటే విప‌రీత‌మైన న‌మ్మ‌కం ఏర్ప‌డింది.

అందుకే జ‌గ‌న్ ప్ర‌మాణ‌ స్వీకారానికి, ఇప్పుడు మంత్రుల ప్ర‌మాణ‌స్వీకారానికి కూడా స్వ‌రూపానందేంద్ర ముహూర్తం పెట్టారు.

-Telugu Political News

కేసీఆర్, జ‌గ‌న్ లకు వచ్చిన ఫలితాలతో ఇప్పుడు ఈ పీఠం పేరు మారుమోగిపోతోంది.ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అనేక మంది ఎన్నిక‌ల‌కు ముందు స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు.దీంట్లో టీడీపీ అభ్య‌ర్థులు కూడా ఉన్నారు.

ఇక ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు అంతా స్వరూపానంద చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్న చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు స్వ‌రూపానందేంద్ర ఆశీస్సులు, రాజ‌శ్యామ‌ల దేవి అమ్మ‌వారి క‌రుణ కోసం శార‌దాపీఠానికి వెళుతున్నారు.

వైసీపీ ఎమ్యెల్యేలైతే ఈ మంత్రివర్గ విస్తరణ లో తమకు అవకాశం దొరికేలా చేయాలంటూ స్వరూపానంద రెకమండేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు.మీరు మా గురించి ఒక్క మాట చెప్తే చాలు మా రాజకీయ జీవితం బ్రహ్మాండంగా వెలిగిపోతుంది అంటూ స్వామిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube