సినిమాల్లో మగవాళ్ళు ఏం చేసినా చూపిస్తారు. కానీ నేను హస్తప్రయోగం చేసుకుంటే తప్పా.?       2018-06-10   00:19:38  IST  Raghu V

కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వర భాస్కర్, తలసానియా ప్రధాన పాత్ర పోషించిన “వీరె ది వెడ్డింగ్” చిత్రంలో బోల్డ్ సీన్లతో పాటు.. ‘పచ్చి’ డైలాగులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్ స్వర భాస్కర్ ఈ సినిమాలో స్వయంతృప్తి పొందుతున్న సీన్‌ చర్చనీయంగా మారింది. అయితే, ఈ సీన్ చేయడానికి ఆమె చేసిన ధైర్యాన్ని కొందరు మెచ్చుకుంటుంటే.. మరికొందరు తిట్టిపోస్తున్నారు.

పెళ్లంటే ఆమడ దూరం పారిపోయే నలుగురు స్నేహితురాళ్ల కథ ఇది. పెళ్లి తర్వాత వారి జీవితాలు ఎలా మలుపు తిరిగాయి? తదితర అంశాలతో రూపొందించిన ఈ అడల్ట్ కామెడీ చిత్రంలో ఓ బోల్డ్ సీన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

-

‘‘సినిమాల్లో మగవాళ్ళు ఏం చేసినా చూపిస్తారు. కానీ ఆడవాళ్లు చేస్తే మాత్రం అలా చేసింది, ఇలా చేసిందంటూ వివాదం సృష్టిస్తారు. ఆ సీన్ చేస్తున్నప్పుడే దీన్ని వివాదం చేస్తారని ఊహించాను’’ అని విమర్శలపై ఘాటుగా స్పందించింది స్వర భాస్కర్.