మ్యాథ‌మెటీషియ‌న్ స్వ‌ర హ్యాష్ ట్యాగ్ తో బాలీవుడ్ భామపై ట్రోలింగ్

బాలీవుడ్ ఇండస్ట్రీలో కొంత మంది సెలబ్రిటీలు అదే పనిగా బీజేపీ పార్టీ మీద, మోడీ మీద విషం కక్కుతూ ఉంటారు.సెక్యులర్ ముసుగు వేసుకొని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకి సపోర్ట్ చేస్తూ మోడీ ఏం చేసిన తప్పే అన్నట్లు విమర్శలు చేస్తూ ఉంటారు.

 Swara Bhaskar Gets Trolled After Telling Wrong Age-TeluguStop.com

ప్రస్తుతం దేశంలో పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీ వివాదం నడుస్తుంది.మెజారిటీ ప్రజలు వీటిని సపోర్ట్ చేస్తూ ఉంటే ఒక వర్గం మాత్రం అదే పనిగా వీటి మీద బురద జల్లుతుంది.

బాలీవుడ్ లో కూడా ఈ రకమైన జనం ఉన్నారు.వారిలో ప్రముఖంగా వినిపించే పేర్లు స్వర భాస్కర్.

ఈ భామ హీరోయిన్ గా చేసిన సినిమాలు తక్కువే అయిన బీజేపీ ప్రభుత్వం, మోడీ మీద విమర్శలు చేస్తూ లౌకికవాదం అంటూ సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడుతూ ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది.ఆ మధ్య జేఎన్‌యూ లో విద్యార్ధులు, పోలీసుల మధ్య యుద్ద వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే, ఈ నేపధ్యంలో ఆ వర్సిటీ పూర్వ విద్యార్థి అయిన స్వ‌ర‌ విద్యార్థులకి స‌పోర్ట్ చేసింది.

తాజాగా సీఏఏ, ఎన్నార్సీపై ఓ టీవీ ఛానెల్ నిర్వ‌హించిన చ‌ర్చ‌లో పాల్గొంది.అక్క‌డ వాటికి వ్య‌తిరేకంగా మాట్లాడుతూ మోడీ మీద విమర్శలు చేసింది.ఐతే 2010లో యూపీఏ స‌ర్కారు ఉండ‌గా ఇదే త‌ర‌హాలో చేప‌ట్టిన నేష‌న‌ల్ పాపులేష‌న్ రిజిస్ట‌ర్ (ఎన్‌పీఆర్‌)ను ఎందుకు వ్య‌తిరేకించ‌లేదంటూ యాంకర్ ప్ర‌శ్నించ‌గా స‌మాధానం దాట‌వేసే ప్ర‌య‌త్నం చేసింది.అప్ప‌టికి త‌న వ‌య‌సు 15 ఏళ్లే అంటూ క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేసింది.

కానీ ప్ర‌స్తుతం ఆమె వయసు 31 ఏళ్లు.దీని ప్ర‌కారం 2010లో ఆమె వ‌య‌సు 21 ఏళ్లు ఉంటాయి.

కాని మీడియా లైవ్ లో అబద్ధం చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో మోడీ మద్దతుదారుల చేతికి, నోటికి పని చెప్పింది.దీంతో మ్యాథ‌మెటీషియ‌న్ స్వ‌ర అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

ఆమె మీద మీమ్స్ త‌యారు చేసి ట్రెండ్ చేస్తున్నారు.ఒక పార్టీ మీద బురద జల్లడానికి స్వర లాంటి వారు ఎన్ని అబద్ధాలు అయిన ఆడుతారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube