నాకంటే దేశమే ముఖ్యం.. ఆ విషయంలో నష్టం కలిగినా వెనక్కి తగ్గనంటున్న స్వరా భాస్కర్..

నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు పెద్దలు.అనవసర విషయాల గురించి మాట్లాడొద్దు.

 Swara Bhaskar About Her Statements Against Caa Bill Details, Swara Bhaskar, Boll-TeluguStop.com

ఆ తర్వాత ఇబ్బంది పడొద్దు.అవసరం లేని విషయాల గురించి ప్రస్తావిస్తే.

అవసరం ఉన్న కొన్ని విషయాల్లో దెబ్బతినే అవకాశం ఉంటుంది.సేమ్ ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంది అందాల ముద్దుగుమ్మ స్వరా భాస్కర్.

అనవరస విషయాలను ప్రస్తావించి తన కాంట్రాక్టుల రద్దుకు కారణం అయ్యింది.తన మాటల మూలంగా చాలా శిక్ష పడినట్లు వెల్లడించింది.

ఇంతకీ తనకు కలిగిన బాధేందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కొంత కాలం క్రితం మోడీ సర్కారు సీఏఏ చట్టాన్ని తీసుకొచ్చింది.

దీనికి గురించి ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది.అయితే ఆ చట్టం గురించి మాట్లాడినందుకు తనకు తగిన శాస్తి జరిగినట్లు వెల్లడించింది.

ఆ వ్యాఖ్యల మూలంగా చాలా కమర్షియల్ బ్రాండ్స్ తనతో ఉన్న ఒప్పందాలను రద్దు చేసుకున్నట్లు చెప్పింది.ప్రభుత్వం తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొంటే తమ ఉత్పత్తులకు చెడ్డ పేరు వస్తుందని ఆయా కంపెనీలు తనతో ఉన్న ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకున్నట్లు చెప్పింది.

కంపెనీలు తనకు ఝలక్ ఇచ్చినా తను మాత్రం వెనక్కి తగ్గేది లేదు అంటుంది స్వరా భాస్కర్.

Telugu Caa, Brands, Indians, Modi, Svara Bhaskar, Swara Bhaskar-Movie

ఈ దేశంలో రాజ్యంగం అనేది అత్యున్నతమైనది అని చెప్పింది.ఎవరు దాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించినా.దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది.

అంతేకాదు.తను ఒకదాన్ని మంచి అని నమ్మతే.

దాని కోసం ఎంత వరకైనా వెళ్తానని చెప్పింది.తనకు వ్యక్తిగతంగా నష్టం కలిగినా పర్వాలేదని చెప్పింది.

Telugu Caa, Brands, Indians, Modi, Svara Bhaskar, Swara Bhaskar-Movie

సమాజానికి కలిగే ఇబ్బందితో పోల్చితే.తనకు కలిగే నష్టం పెద్ద నష్టమేమీ కాదని వెల్లడించింది.మోడీ చట్టాలు అనే కాదు.ఎవరు రాజ్యాంగ వ్యతిరేక పనులకు ప్రయత్నించినా.తాను వ్యతిరేకిస్తానని వెల్లడించింది.భారతీయులంతా స్వేచ్ఛగా జీవించాలనేదే తన కోరిక అని చెప్పింది.

దానికి ఎవరు అడ్డుగా వచ్చినా తన పోరారం కొనసాగుతుందని వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube