ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు.. నానికి పరిపూర్ణానంద వార్నింగ్‌  

swamy paripoornananda reacts kodali nani ttd comments Kodali Nani, swamy paripoornananda, Tirumala, AP, Jagan, YSRCP - Telugu Kodali Nani, Swamy Paripoornananda, Tirumala Tirupati Devastanam, Ttd, Ys Jagan

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు డిక్లరేషన్‌ ఏమీ అక్కర్లేదు అంటూ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నుండి మొదలుకుని పార్టీ నాయకుల వరకు ఎంతో మంది ఈ విషయం ఫై నాని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

TeluguStop.com - Swamy Paripoornananda Reacts Kodali Nani Ttd Comments

తాజాగా నాని వ్యాఖ్యలపై స్వామి పరిపూర్ణానంద తీవ్రంగా స్పందించారు.నాని వ్యాఖ్యలపై ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన డిక్లరేషన్‌ విషయం ఫై ఘాటుగా స్పందించారు.

ధర్మాన్ని కాపాడేందుకు మేము ఎప్పుడు ముందు ఉంటాం.హిందుత్వం కోసం మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం అన్నారు.

TeluguStop.com - ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు.. నానికి పరిపూర్ణానంద వార్నింగ్‌-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

స్వామి పరిపూర్ణానంద ఇంకా మాట్లాడుతూ… దేవాలయాలు దేవుడి విషయంలో మాట్లాడేప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడటం మంచిది.నాని చేసిన వ్యాఖ్యలు జగన్‌ కు వినిపించాయా.ఈ విషయంలో సీఎం జగన్‌ స్పందించకుంటే నాని వ్యాఖ్యలకు ఆయనే కారణం అంటూ భావించాల్సి వస్తుంది.శ్రీవారి దర్శనంకు వెళ్లే వారు ఖచ్చితంగా డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందే.

తిరుమల గురించి ఇలాంటి చర్చ జరగడం దారుణం.ఇప్పటికే ఉన్న వివాదాన్ని మరింతగా పెంచేలా మంత్రి నాని వ్యాఖ్యలు ఉన్నాయి.

గత ఎన్నికల్లో వైకాపాకు వచ్చిన సీట్లలో 150 కి 149 స్థానాలు హిందువులు కట్టబెట్టారు.ఆ విషయాన్ని జగన్‌ గుర్తు పెట్టుకోవాలంటూ స్వామి పరిపూర్ణానంద వ్యాఖ్యలు చేశారు.

#Kodali Nani #YS Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Swamy Paripoornananda Reacts Kodali Nani Ttd Comments Related Telugu News,Photos/Pics,Images..