ఆర్టికల్ 370 రద్దు సాహోసోపేత నిర్ణయం,ఇక ఇప్పుడు పీవోకే నే టార్గెట్

జమ్మూకాశ్మీర్ విభజన ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ నిర్ణయం పై ఇప్పటికే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.

 Swami Sensational Comments On Article 370 Scrapping-TeluguStop.com

కొందరు ఇది నిరంకుశ చర్య అని అంటూ కామెంట్ చేస్తుండగా, మరికొందరు అయితే సరైన నిర్ణయం శభాష్ అంటూ వెన్నుతడుతున్నారు.ఏది ఎలా ఉన్నా వివాదాస్పద నేత,బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

కాశ్మీర్ ను విభజించిన బీజేపీ తరువాత అడుగు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడమే అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారం రేపుతోంది.ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు గురించే పాక్ తనదైన శైలి లో స్పందించిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అన్న అనుమానం కలుగుతుంది.అంతేకాకుండా కాశ్మీర్ పై బీజేపీ దూకుడు చూసిన తరువాత అమెరికా అధ్యక్షుడు కూడా పీవోకే ప్రాంతాన్ని మర్యాదగా భారత్ కు అప్పగించాలని అన్నట్లు స్వామి కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ఎప్పుడూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే ఆయన మరోసారి అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతోనే వార్తల్లో నిలిచారు.ఇటీవల కాశ్మీర్ అంశంపై ఇరు దేశాలు ఒప్పుకుంటే మధ్యవర్తిత్వం వహిస్తాను అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా స్వామి ట్రంప్ వ్యాఖ్యల పై కూడా కామెంట్ చేశారు.మధ్యవర్తిత్వం వహించాలని ట్రంప్ గారు భావించారు.

ఇక ఇప్పుడు ఆయన మధ్యవర్తిత్వం వహించేందుకు కాశ్మీరే మిగిలలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.

-Political

1996లోనే ప్రధాని పీవీ నరసింహరావు హయాంలోనే పార్లమెంట్ లో ఈ విషయంపై తీర్మానం చేశారని, అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా ఆర్టికల్ 370ని రద్దు చేయడం బీజేపీ మాత్రమే చేయగలిగింది అని, ఇది బీజేపీ తీసుకున్న సాహోసోపేత నిర్ణయం అంటూ ఆయన అభివర్ణించారు.ఈ సందర్భంగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు స్వామి తన అభినందలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube